- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ముగ్గురు పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు ? : ఆస్పత్రిలో తల్లి ఆవేదన
బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు అక్కచెల్లెళ్ల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం.. 19 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్న తాండూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. అయినవారిని, ఆప్తులను కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తుండటం అక్కడున్నవారిచేత కూడా కంటతడి పెట్టిస్తోంది.
బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు అక్కచెల్లెళ్ల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. తనూష, సాయిప్రియ, నందినిల తల్లి ప్రమాదంలో చనిపోయిన తన కూతుళ్లను ఎవరు తీసుకొస్తారంటూ గుండెలు బాదుకున్నారు. గతవారంలో తమ బంధువుల పెళ్లికి ఇంటికొచ్చిన కూతుళ్లు వెంటనే వెళ్లిపోతామంటే తానే ఉండమన్నానని, ఈరోజు పరీక్షలు ఉన్నాయని ఉదయాన్నే బయల్దేరారని చెప్పారు. ఆ టిప్పర్ డ్రైవర్ తాగి వాహనాన్ని నడిపి తన కూతుళ్ల ఉసురు తీశాడని, ఐదుగురు పిల్లల్లో నలుగురు ఆడబిడ్డలు, ఒక మగబిడ్డ సంతానం ఉన్న తనకు ఇప్పుడు ఇద్దరే మిగిలారంటూ రోదించారు. కూతుళ్ల కోసం ఎంతో కష్టపడ్డామని, ముగ్గురూ హైదరాబాద్ లో చదువుకుంటున్నారని తెలిపారు. కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు మంచినీరు తాగించి ధైర్యం చెప్పారు. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తవ్వగా వాటిని తల్లిదండ్రులకు అప్పగించారు.
Read More.. హతవిధీ..! చావులోనూ ఒక్కటై: బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం






