- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల తీరు భేష్.. యాయాక్సిడెంట్ తరువాత స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం
చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్థ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 19 మంది మృతదేహాలను తరలించడం, గాయపడిన 14-15 మండికి వైద్య సహాయం అందించడం, పోస్ట్ మార్టం ప్రక్రియలో అధికారులు చూపిన తీరును ప్రజలను మెచ్చుకున్నారు.

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్థ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 19 మంది మృతదేహాలను తరలించడం, గాయపడిన 14-15 మండికి వైద్య సహాయం అందించడం, పోస్ట్ మార్టం ప్రక్రియలో అధికారులు చూపిన తీరును ప్రజలను మెచ్చుకున్నారు. సాధారణంగా ఒక మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒక రోజు తీసుకునే వైద్యులు.. మూడున్నర గంటల్లోనే 18 మృతదేహాలు, 2 నెలల శిశువు పోస్ట్ మార్టం పూర్తి చేసి, కుటుంబాలకు అప్పగించారు. చేవెళ్ల రెవెన్యూ అధికారులు, వైద్య అధికారులు, పోలీసులు సమిష్టిగా పని చేసి ఘటన జరిగిన తర్వాత ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మృతదేహాలు కుటుంబ సభ్యులు గుర్తించిన వెంటనే పోస్ట్ మార్టం చేసి, ప్రతి మృతదేహానికి ఒక అధికారిని వెంట పంపించారు. కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్ని పనులు దగ్గరుండి చూసున్నారు. వెంట వెంటనే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారు.
సహాయక చర్యల్లో పోలీసులు..
నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించి, ఎక్కడికా బరికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు ఇబ్బంది లేకుండా చూశారు. సహాయక చర్యలో కూడా ముందు ఉండి పని చేశారు. స్థానిక సీఐ భూపాల్ శ్రీధర్ కాలికి గాయమైనా ఆస్పత్రిలో ఉండి సిబ్బందిని మానిటర్ చేశారు.
స్థానికుల సాయం..
ఈ ఘటనలో స్థానికులు మానవత్వం ప్రదర్శించారు. ప్రమాద స్థలంలో బస్సులోని వారిని బయటకు తీయడంలో పోలీసులకు సహాయం చేశారు. కంకర కుప్పలో మునిగిన వారిని బయటకు తీయడంలో వారు ముందున్నారు.






