Big Rain Alert : ఉత్తర తెలంగాణకు కుండపోత వర్షాల హెచ్చరిక

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

Big Rain Alert : ఉత్తర తెలంగాణకు కుండపోత వర్షాల హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ పంపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దక్షిణ, తూర్పు జిల్లాల్లోనూ..

ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాల జోరు కొనసాగనుంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడి, విస్తారంగా వానలు పడతాయని అంచనా వేశారు.

ప్రజలకు, రైతులకు కీలక సూచనలు

వరుసగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రయాణాలు చేసే వారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

Next Story