- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మధు పార్క్ రిడ్జ్’ కన్నీటి రోదన
సర్కారు నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్‌ను తీసుకుంటున్నారని తెలిసి బాధితులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

దిశ, గండిపేట: సర్కారు నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్‌ను తీసుకుంటున్నారని తెలిసి బాధితులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తాము ప్రాణాలైనా ఇస్తాం.. కానీ తమ ఇళ్ల ను మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఖాళీ జాగాలు ఉన్న సర్కారు స్థలా ల్లో నిర్మించవచ్చు కదా అని చెబుతున్నారు.
పదిన్నర ఎకరాల స్థల సేకరణ..
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కా రు ప్రతిష్టాత్మకంగా మూసి ఈసీ నదులు కలిసే చోట బండ్లగూడ జాగిర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ సమీపంలో గాంధీ సరో వర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయ తలపెట్టింది. ఇందులో భాగంగా అక్కడ అభివృద్ధి చేసి అదేవిధంగా ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇందు లో భాగంగా మధు పార్క్ రిడ్జ్ గేటెడ్ క మ్యూనిటీ ఉన్న సుమారు పదిన్నర ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు ఇప్పటికే మీడియా లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యం లో రాజేంద్రనగర్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి ఆ ధ్వర్యంలో గురువారం ప్రజాభిప్రాయ సేకర ణ కూడా చేపట్టింది. తాము పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టు కో సం సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తమకు పరిహారం వద్దని తాము ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లే కావాలని నివాసితులు ఈ సందర్భంగా స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మధుపార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసితులు ఆందోళన చేపట్టారు. తమ ప్రాణా లైనా ఇస్తాం కానీ తాము నివాసముంటున్న ఇళ్లను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తాము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే చస్తాం కానీ సర్కారుకు ఇవ్వమని తెలిపారు. అక్కడికి వచ్చిన మీడియాను చూసి కొందరు వృద్ధులు కన్నీటి పర్యంతమ య్యారు. ఎవరికైనా కష్టాలు వస్తే ప్రభుత్వానికి చెప్తాం కానీ సర్కారే కష్టాలు తీసుకొస్తే ఎవరికి చెప్పాలని లబోదిబోమన్నారు. తా ము అప్పులు చేసి ఫ్లాట్లను కొనుక్కున్నామ ని ఇప్పుడు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు తో ఎవరికి ఉపయోగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పరిహారం ఎంత ఇచ్చిన అవసరం లేదని తెగేసి చెప్పారు.
మణులు, మాణిక్యాలు వద్దు..
మా ఇంట్లో 11 మంది ఉంటున్నాం. నాకు ము ని మనువాలు కూడా ఉన్నారు. మాకు డబ్బ లు .. మణులు.. మాణి క్యా లు వద్దు. మేము ఉంటున్న ఇల్లు ను ప్రభుత్వానికి ఇవ్వం. నాలాంటి ముసలోళ్ళను ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి సర్కారుకు ఉసురు ముడుతుంది.
- మహాదేవమ్మా, మధుపార్క్ రిడ్జ్ నివాసితురాలు
ఉన్న బాపుఘాట్‌నే పట్టించుకుట్టలే..
ఉన్న బాపు ఘాట్‌నే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం మహా త్మా గాంధీ, జయం తి వర్ధంతి సమయాల్లో మా త్రమే నాయకులు వస్తారు. ఉన్న ఇళ్లను కూ ల్చేసి నాకు పెద్ద విగ్రహం పెట్టమని గాంధీ జీ అడిగారా..? వేల కోట్లు ఖ ర్చుపెట్టి విగ్ర హం పెడితే ఏమొస్తుం ది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇళ్లను ఇచ్చే ప్రసక్తి లేదు. ఇండ్లు తీసుకొని రోడ్డున పడేయొద్దు.
- శిరీష, మధు పార్కు రిడ్జ్ నివాసితురాలు






