రాజకీయ నాయకుల జాడేదీ.. హామీలిచ్చి భరోసా కల్పించే నాథుడే కరువు.!

by Chintha Aamani |

భారీ వర్షం కురుస్తున్న వేళ తాండూరులో రాజకీయ నాయకుల సలహాలు సూచనలు కరువయ్యాయి.

రాజకీయ నాయకుల జాడేదీ.. హామీలిచ్చి భరోసా కల్పించే నాథుడే కరువు.!
X

దిశ, తాండూరు :భారీ వర్షం కురుస్తున్న వేళ తాండూరులో రాజకీయ నాయకుల సలహాలు సూచనలు కరువయ్యాయి.తాండూరు వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగుతున్న,రాజకీయ నాయకులు విందు, వినోదల కార్యక్రమాల్లో పాల్గొనడం తో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.

గత మూడు రోజుల తాండూరు వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.అలాగే వికారాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. మంబాపూర్ గ్రామ సమీపంలో నీటి గుంతలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.జీవన్గిలోని మహాదేవ లింగేశ్వర దేవాలయం

వీర్ శెట్టిపల్లి గ్రామంలో అర్ధరాత్రి నుండి జలదిగ్బంధంలో చిక్కుకుంది. జుంటి పల్లి ప్రాజెక్ట్ ఉప్పొంగిపోతుంది.విశ్వనాథ్ పూర్ బ్రిడ్జిపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.అలాగే తాండూరు కోకట్, కోట్ పల్లి కాగ్నా నది ఉగ్రరూపం గా ప్రవహిస్తుంది. తాండూరు ప్రాంతంలో ఉన్న పలు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరి అని రకాల పంటలు నాశనం అయ్యాయి. కాగ్నా నది పొంగిపొర్లిన కారణంగా తాండూర్ -వికారాబాద్,తాండూరు -జహీరాబాద్,తాండూరు- కర్ణాటక తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నీ కొన్ని గంటలు నిలిచిపోయాయి.తాండూరు వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రజల్లో అధికారుల యంత్రాంగం

గురువారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి తో కలిసి తాండూరు సబ్ డివిజన్ పరిధిలో పర్యటించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్టు ప్రకటించిన వాతావరణ శాఖ సూచనల మేరకు తాండూర్, యాలాల, పెద్దేముల్ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాలాల మండలం కోకట్ సమీపంలో గల కాగ్నా నది వంతెన పెద్దేముల్ మండలం ఇందూర్ ప్రాంతాన్ని కలెక్టర్,అధికారులతో కలిసి పరిశీలించారు.అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, తాండూర్ డీస్పీ బాలకృష్ణ రెడ్డి, రెవెన్యూ, పోలీస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

విందు, వినోదల్లో రాజకీయ నాయకులు

తాండూరు రెడ్ అలర్ట్ జిల్లాలో ఉంది. ప్రజలు, వాహనదారులు,ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కానీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు మాత్రం విందు, వినోదాల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి, విట్టల్ రెడ్డి ల వెంటనే వారి వారి ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అనేక శుభకార్యాలలో పాల్గొన్న ఫొటోస్ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి.రైతులు, ప్రజలు, వాన దారులు, ప్రయాణికులు తదితరు ఇబ్బందులు పడుతున్న రాజకీయ నాయకులు పట్టించుకోరా అని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు పర్యటించి.. పలు సూచనలు,సలహాలు చేసి స్థానిక ప్రజలకు భరోసా కల్పించడంలో తాండూరులో అధికార, విపక్ష నేతలు విఫలమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story