ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

by Ratna Kumari |

తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఉద్యోగంలా పని చేసిన క్రియాశీలక ఉద్యమకారులు అందరినీ గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందజేయాలని వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిన‌ట్టు జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఉద్యోగంలా పని చేసిన క్రియాశీలక ఉద్యమకారులు అందరినీ గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందజేయాలని వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిన‌ట్టు జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ లోని వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ( తెలంగాణ ఐ కా స) జిల్లా మాజీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నేత కే.శ్రీనివాస్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈసందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు తెలంగాణ బిసి కమీషన్ మాజీ సభ్యులు ఎన్.శుభప్రధ పటేల్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా లో పలువురు మేధావులు కళాకారులు జర్నలిస్టులు ఉద్యోగులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి క్రియాశీలక పాత్ర పోషించారని వారిపై కేసులు నమోదు అయితే వారి భవిష్యత్తు దృష్ట్యా కేసుల నుండి తప్పించామని వారికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ఉద్యమంలో వికలాంగులు అయిన వారికి జైలుకు వెళ్లిన వారికి కేసులు నమోదు అయిన వారిని పరిగణనలోకి తీసుకుంటుందని అలాగే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారందరికీ ఉద్యమ బాద్యతలు మోసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర ఆర్టీఏ సభ్యులు ఎర్రవల్లి జాఫర్ మాట్లాడుతూ ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగని మాట వాస్తవమని ప్రస్తుత కాంగ్రేస్ ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరి కల్గి ఉందని అందులో భాగంగానే ఉద్యమ నాయకులతో కేశవరావు అధ్యక్షతన కమిటీ వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానిక శాసనసభ్యులు తెలంగాణ శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ లు తప్పకుండా ఉద్యమకారుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటారని అభిప్రాయ పడ్డారు. మన శాసనసభ్యులు ద్వారా ఉద్యమకారుల ప్రతిపాదనలను కేశవరావు నేతృత్వంలోని కమిటీకి తద్వారా ముఖ్యమంత్రికి నివేదిద్దామనీ అన్నారు. సమావేశంలో ఉద్యమ నాయకులు బైండ్ల విజయకుమార్ ఎమ్.సురేష్ రవిశంకర్ గంగ్యా నాయక్ ( పరిగి) కే .భాను ( తాండూరు) టి.రామచందర్ శివకుమార్ రెడ్డి శాంత్ కుమార్ దేవదాస్ మారుతి బుస్స శ్రీకాంత్ బాలరాజు నాయక్ టి.శంకర్ కే.అంజయ్య సమద్ జాకీర్ బి.కృష్ణయ్య పలువురు అధ్యాపకులు విద్యార్థి నాయకులు యూత్ నాయకులు మేధావులు పాల్గొన్నారు. సమావేశంలో జూన్ 2 వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమకారులు అందరూ జిల్లా కేంద్రానికి (అమరవీరుల స్థూపం వద్ద) తరలి రావాలని పిలుపు ఇచ్చారు. అమరవీరులకు నివాళులు అర్పించి శాసన సభాపతి ప్రసాద్ కుమార్ ఉద్యమకారుల సమావేశం ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు.

Next Story