ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

by Ratna Kumari |

షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా :  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
X

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో రూ 3.50 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రసాదం కౌంటర్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం సర్పంచ్ మానస సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story