- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహనీయుల ఆశయాలను ప్రజాల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే
మహనీయుల సిద్ధాంతాలు నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ప్రొపెసర్ కాశిం, జె.బి.రాజు అన్నారు.

దిశ, చేవెళ్ల: మహనీయుల సిద్ధాంతాలు నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని దళితసేన జాతీయ అధ్యక్షులు జె.బి.రాజు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొపెసర్ కాశిం, బసవ మహమానే ట్రస్టు అధ్యక్షులు డా. సిద్ధ రామేశ్వర్ శరనారు బెల్జాల్ అన్నారు. మహనీయుల జయంతిని పురస్కరించుకుని చేవెళ్ల మహనీయుల జాతర కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జాతర కార్యక్రమం చేవెళ్లలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుల జాతర ర్యాలీని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేజీఆర్ గార్డెన్ లో జరిగిన సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహనీయులు జీవితాలను త్యాగం చేయడంతోనే మనమంతా సంతోషంగా ఉన్నామని తెలిపారు. క్రీస్తు పూర్వమే బుద్ధుడు సమానత్వం బోధించడాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్
మహిళలు చదువుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్ర్యo కావాలని ఇంగ్లండ్ లో బ్రిటిష్ వాలను ఎదిరించారని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఎంతో మంది మంత్రులు, ఐపీఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ప్రొపెసర్లు అయ్యారన్నారు. చదువుకుంటే జ్ఞానం వస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని తెలిపారు. గ్రామాల్లో యువత మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, చెడు అలవాట్లతో డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. యువత విద్యపై దృష్టి సారించాలన్నారు. బహుజన రాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే కాలె యాదయ్య
మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మహనీయుల విగ్రహాలు పెట్టి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేసి వదిలేయొద్దని, వారి ఆలోచన, సిద్ధాంతాలను ప్రజలకు తెలిపేవిధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల అడుగుజాడల్లో నడవలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ పామేన భీం భరత్, మహనీయుల కమిటీ చైర్మన్ బురాన్ ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జీ దేశమొల్ల ఆంజనేయులు, మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, మంగలి కల్యాణియాదగిరి, సోలిపురం సుచితబల్వంత్ రెడ్డి, మద్దెల శ్రీనివాస్, ఫైండ్ల మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు...
వీరితో పాటు దేవులపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి నర్సింలు, కృష్ణానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీడి పెంటయ్యగౌడ్, బ్యాగరి రాములు, ముడిమ్యాల సొసైటీ మాజీ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.రామస్వామి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, బీజేపీ యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, చేవెళ్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్, మహనీయుల కమిటీ వైస్ చైర్మన్లు మాచన్ పల్లి రామస్వామి, నరేందర్, కమిటీ సభ్యులు బ్యాగరి ప్రభాకర్, మల్లెపలి శ్రీనివాస్, ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘాల సభ్యులు, మేధావులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






