- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thandoor: చికెన్ వ్యర్థాలతో దందా!.. కొనసాగుతున్న రవాణా
తాండూరు మున్సిపాలిటీలో నిబంధనలు పాటిస్తూ బల్దియా ఆదాయం పెంచేందుకు కృషి చేయా ల్సిన అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు తప్పుడు మార్గాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో నిబంధనలు పాటిస్తూ బల్దియా ఆదాయం పెంచేందుకు కృషి చేయా ల్సిన అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు తప్పుడు మార్గాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల వైఖరి కారణంగా బల్దియా ఆదాయానికి గండి పడుతుండగా, ప్రైవేట్ వ్యక్తి కోట్లు గడిస్తున్నారు. తాండూరు మున్సిపల్‌లో గతంలో జంతువుల వ్యర్థాల టెండర్ నిర్వహించారు. కాగా టెండర్ దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టలేక టెండర్ రద్దు అయ్యింది. కానీ జంతువు వ్యర్థాల రవా ణా మాత్రం ఆగలేదు. అదే అదునుగా జంతు వ్యర్థాల రవాణా చేస్తున్న వ్యక్తిని మున్సిపల్ అనుమతి లేకుండా ఎలా రవాణా సాగిస్తున్నావని నిలదీశారు. ఆ వ్యక్తి తాండూరు మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు భారీ మొ త్తంలో ముడుపులు ముట్టచెప్పారని విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీ పైసా ఖర్చు లేకుండా సంవత్సరానికి లక్షల ఆదాయం సమకూర్చే టెండర్ రద్దు కావడంతో పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.
టెండర్లకు ఆహ్వానం..
గతేడాది ఏప్రిల్ 17న మటన్, చికెన్, ఫిష్ వేస్టేజీలను సేకరించి సైంటిఫిక్ డిస్పోజల్ ఏజెన్సీలతో రవాణా చేసేం దుకు నియామకం కోసం ఏజెన్సీల నుంచి రెండు టెండర్ దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా.. గత ఏడాది అదే నెల 19న 11 గం టలకు ఉదయం ఓపెన్ వేలం ఉం టుందని, అందుకు రూ.25,000 నాన్ రిఫండెబుల్ చెల్లించి పాల్గొనాలని క మిషనర్ సూచించారు. కాగా.. అంతకుముందు ఒక ఏజెన్సీకి అధికారులు మద్దతు తె లుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏఐఎంఐఎం నాయ కులు హాది షహారి, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ఈ విషయంలో కమిషనర్‌ను అడిగారు. దీంతో కమిషనర్ మున్సి పల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేశ్ పాటిల్, డీఈ రంగనాథ్‌తో సమావేశమై టెండర్ల ప్రక్రియను చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.
పాల్గొన్నది ఇద్దరే..
గతేడాది ఏప్రిల్ 17న టెండర్లలో ఇద్దరు మా త్రమే పాల్గొన్నారు. ఈ టెండర్ల ప్రక్రియలో భాగంగా స్ర్కూటీని జరిగింది. కురిసి ట్రేడర్స్ ఆ పరేటర్ పై మూడు కేసులున్నందున.. ఈ కేసులు ఉన్నాయా? లేదా? సంబంధిత పోలీసు అధికారుల ద్వారా నివేదిక అనంతరం వేలం నిర్వహించనున్నట్లు అప్పటి కమిషనర్ శంకర్ సింగ్ తెలిపారు.
మామూళ్ల మత్తులో అధికారులు..?
టెండర్ దక్కించుకున్న వ్యక్తి డబ్బులు కట్టలేక టెండర్ రద్దు అయ్యింది. కానీ జంతువు వ్యర్థాల రవాణా మాత్రం ఆగలేదు. అదే అదునుగా జంతు వ్యర్థాల రవాణా చేస్తున్న వ్యక్తిని మున్సిపల్ అనుమతి లేకుండా ఎలా రవాణా కొనసాగిస్తున్నావని నిలదీశారు. ఆ వ్యక్తి తాండూరు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారని విశ్వసనీయ సమాచారం. భారీ మొత్తంలో టెండర్ దక్కడంతో నాడు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించి మున్సిపల్‌కు భారీ ఆదాయం చేకూరిందని సంబురాలు నిర్వహించారు. అలాంటిది జంతు వ్యర్థాల టెండర్ రద్దు కావడంతో అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో రికార్డు..!
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బహిరంగ వేలంలో రూ.30 లక్షల 65 వేల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. భారీ మొత్తంలో టెం డర్ దక్కడంతో నాడు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించి మున్సి పల్‌కు భారీ ఆదాయం చేకూడదని సంబురాలను నిర్వహించారు. అలాంటిది జంతు వ్యర్థాల టెండర్ రద్దు.. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు మామూళ్లు యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా? కావాలనే చేశారా? అర్థం కావడం లేదని తాండూరు పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఎమ్మెల్యే సీరియస్?
టెండర్ రూపంలో భారీ మొత్తంలో మున్సిపాలిటీకీ ఆదాయం వస్తుం దని ప్రజా ప్రతినిధులు, అధికారు లు, పట్టణ ప్రజలు సంతోషించారు. ఇంతలోపే ఈ విషయంలో జంతు వ్యర్థాల రవాణా నిర్వహిస్తున్న వ్యక్తి తో మున్సిపల్ అధికారులు పలు సలహాలు ఇచ్చారు. మున్సిపల్‌కు ఎంతో కొంత అధికారికంగా డ బ్బులు కట్టి పని చక్క పెట్టుకోమని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త ఎమ్మెల్యే బు య్యని మనోహర్ రెడ్డి దృష్టికి వెళ్లిన ట్లు సమాచారం. ఎమ్మెల్యే మున్సి పల్ అధికారులపై సీరియస్ అయిన ట్లు తెలిసింది. చికెన్ వ్యర్థాల వ్యవ హారం అధికారపక్షంలో చిచ్చురేపింది.






