Thandoor: వ్యాపారులే ముందస్తు టార్గెట్.. చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు

by Ramesh Goud |

తాండూరు వ్యాపార కేంద్రంగా ఉండడంతో సైబర్ మోసగాళ్లు ఈ కేంద్రాన్ని అదునుగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు.

Thandoor: వ్యాపారులే ముందస్తు టార్గెట్.. చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు
X

దిశ, తాండూరు : తాండూరు వ్యాపార కేంద్రంగా ఉండడంతో సైబర్ మోసగాళ్లు ఈ కేంద్రాన్ని అదునుగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్ణాటకలో దొంగలించిన మొబైల్‌తో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తాండూర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకోవడంతో తాండూర్ వ్యాపారులు సైబర్ కేసుల్లో ఇరుక్కొని వారి అకౌంట్ ఫ్రీజ్ అయ్యాయి. ఇది మరవకముందే మరో ఘటన తాండూరు‌లో చోటు చేసుకున్నది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రిక్వెస్ట్ పేమెంట్ పంపిస్తూ వ్యాపారుల ద్వారా తనకి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తూ వారికి టోకరా పెడుతున్నారు. వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తు తెలియని యువకుడు ఓ కిరణ్ కొట్టుకు వెళ్లి తనకు ఆయిల్ డబ్బాలు 2 కావాలంటూ బేరసారాలు చేశాడు. దీంతో ఆ కిరాణా యజమాని రూ.4600 అవుతాయని తెలిపాడు.

దీంతో తొందరగా ఇవ్వాలని చెప్పి ఫోన్ పే ఉందా? లేదా? గూగుల్ పే ఉందా? అని ఆ యువకుడు అడిగాడు. దీంతో సదరు వ్యాపారి ఫోన్ పే ఉందని తెలపడంతో అతనికి ఫోన్ పే ద్వారా పేమెంట్ పంపించాడు. దీంతో ఆ కిరాణ యజమాని ఫోన్లో వచ్చిన ట్రాన్జక్షన్ మాత్రమే చూసుకొని వచ్చాయని నమ్మబలికి డబ్బాలను తీసుకెళ్లాడు. మరో వైపు ఇంకో షాపులో కూడా బియ్యం బస్తాలు కావాలంటూ అక్కడ కూడా ఇదే తరహాలో రూ.4500, మరో షాపులో సంతూర్ సోప్ కాటన్ కావాలంటూ అక్కడా రూ.6 వేలకు కొనుగోలు చేశాడు. వీటన్నింటికీ రిక్వెస్ట్ పేమెంట్ పంపించి వెళ్లిపోయాడు. వ్యాపారులకు ఎంతకుగానో తమ అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో తాము మోసపోయినట్లుగా గుర్తించుకున్నారు. తీరా ఆ వ్యక్తి ఎక్కడ దొరుకుతాడని ఎంక్వయిరీ చేసినా ఫలితం దక్కలేదు. ధరూర్‌లో ఫంక్షన్ ఉన్నదని, అందుకు వస్తువులు అవసరం ఉన్నట్లుగా తెలిపినట్లుగా సమాచారం. ఇలా తాండూర్ వ్యాపార కేంద్రంగా ఉన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ రిక్వెస్ట్ పేమెంట్లను పంపిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

Next Story