- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మూసీ' అభిప్రాయ సేకరణ సభలో ఉద్రిక్తత
మూసి నది సుందరీకరణ ప్రాజెక్టు నేపథ్యంలో భూసేకరణపై నిర్వహించిన అభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, గండిపేట : మూసి నది సుందరీకరణ ప్రాజెక్టు నేపథ్యంలో భూసేకరణపై నిర్వహించిన అభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతకు దారితీసింది. రాజేంద్రనగర్ సర్కిల్-19 కిస్మత్ పూర్ లోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి గాంధీ సరోవర్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ కు చెందిన బాధితులు భారీగా హాజరయ్యారు. ప్రాజెక్టు లక్ష్యం, భూసేకరణ విధానం గురించి అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ, క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్న ఇళ్లను అక్రమంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. పని దినాల్లో సమావేశం ఏర్పాటు చేయడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వివరాలు లేకుండానే ఇళ్లు, భూములు స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశం మధ్యలో బాధితులు ఆర్డీవో వద్దకు వెళ్లి నిరసన తెలపడంతో కార్యాలయంలో తోపులాట జరిగింది.
భారీగా పోలీసు బందోబస్త్
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను అడ్డుకున్నారు. "ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు కానీ ఇళ్లు ఇవ్వం" అని బాధితులు స్పష్టం చేశారు. అధికారుల తీరుపై అసంతృప్తితో సమావేశం ప్రతిష్టంభనకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అన్ని విధాలుగా పరిహారం
మూసి సుందరీకరణతో పాటు గాంధీ సరోవర్ ప్రాజెక్టుల్లో భాగంగా సుమారు 10 ఎకరాల 33 గంటలకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాజేంద్రనగర్ ఆర్డిఓ వెంకటరెడ్డి పేర్కొన్నారు. చాలామంది బాధితులు సమావేశానికి హాజరైనట్లు వివరించారు. ఈ సందర్భంగా సుమారు 200 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. చట్ట పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు బాధితులు కోరిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వారిని సంతృప్తి పరిచిన తర్వాత తగిన విధంగా ముందుకు వెళ్తామని ఆర్డిఓ స్పష్టం చేశారు. చాలామంది బాధితులు ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇచ్చారని తెలియజేశారు. వీటిని పరిగణలోకి తీసుకుంటామని ఆయన వివరించారు.






