- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పునర్విభజన.. ఫ్యూచర్ సిటీ టార్గెట్‌గా కొత్త నియోజకవర్గాలు
ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంసీ పునర్విభజనను చేపట్టింది. రేర్, క్యూర్, కేర్ విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : 2011 జనాభా లెక్కల ఆ ధారంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు రా జ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పార్లమెంటు సీట్లు 26 వరకు, అసెంబ్లీ స్థానాలు 179కి పెరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవే ళ పునర్విభజన జరిగితే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి? అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోం ది. అలాగే.. మారనున్న రాజకీయ ముఖచిత్రం అంశం సైతం తెరపైకి వస్తోంది. ఏడు జిల్లాల సరిహద్దులతో.. ఐదు లోక్ సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా పునర్విభజనపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
ప్రభుత్వం ఇటీవల జీహెచ్‌ఎంసీ పునర్విభజనను చేపట్టింది. రేర్, క్యూర్, కేర్ విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించి రంగారెడ్డి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. అలాగే..గతంలో ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లను నాలుగు కమిషనరేట్లుగా మార్చడంతో కొత్తగా ఫోర్త్ సిటీ పేరుతో కమిషనరేట్ ఏర్పాటైంది. పోలీ స్ కమిషనరేట్ల హద్దులు.. జిల్లాల సరిహద్దులు ఒ కే విధంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో రంగారెడ్డి జిల్లాను అర్బన్, రూరల్ జిల్లా లుగా విభజించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జ రుగుతోంది. కందుకూరు, మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్ల, ఆమన్‌గల్, శంషాబాద్ రూరల్ మండలం, మాడ్గుల, తలకొండపల్లి, యాచారం, మంచాల తదితర మండలాలతో ఫ్యూచర్ సిటీ క మిషనరేట్‌ను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సమానంగా ఇతర ప్రాంతాలను కలుపుకుని కొత్త జిల్లాను ఏ ర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సం బంధించి రెవెన్యూ శాఖ వివరాలను సేకరించి ప్ర భుత్వానికి సైతం నివేదించినట్లు సమాచారం. రా జకీయ ముఖచిత్రం మారిపోయి ‘పునర్విభజన’ రాజకీయాల్లో ఓ గేమ్ ఛేంజర్‌గా నిలవనున్నదన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
పెరగనున్న ఎమ్మెల్యే స్థానాలు !..
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఏడు శాసన సభ నియోజకవర్గాలు పూర్తిగా జిల్లా పరిధిలో ఉండగా.. కల్వకు ర్తి నియోజకవర్గంలో మాత్రం సింహభాగం మం డలాలు ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడ్గుల, క డ్తాల్‌లు రంగారెడ్డి జిల్లాకు చెందినవే ఉన్నాయి. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలంతో కలిపి రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాలతో ఆమన్‌గల్ అసెంబ్లీ నియోజకవర్గం గా ఏర్పడనున్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గా ల నుంచి వ్యక్తమవుతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి హయత్ నగర్ కేంద్రంగా కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడుతుందన్న వాదన విన్పిస్తోం ది. మహేశ్వరం నియోజకవర్గ విషయానికొస్తే ఖచ్చితంగా రెండు కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకటి, బడంగ్‌పేట్ లేదా బాలాపూర్ కేంద్రంగా మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశా లు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. శేరిలింగంపల్లి పునర్విభజన సందర్భంగా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడవచ్చన్నది తెలుస్తోంది. మియాపూర్, గచ్చి బౌలి, కొండాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతా లు నియోజకవర్గ కేంద్రాలుగా కొత్తవి ఆవిర్భవించవచ్చు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సైతం కొత్తగా ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడనున్నట్లు తెలు స్తోంది. శాస్త్రిపురం, అత్తాపూర్, శంషాబాద్‌లలో ఒకటి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా 8 లేదా 9 కొత్త అసెంబ్లీ స్థానాలు రంగారెడ్డి జిల్లాలో ఏర్పా టు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్తగా రెండు లోక్ సభ స్థానాలు !..
రంగారెడ్డి జిల్లా ఐదు లోక్ సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. ఎల్బీనగర్ అసెంబ్లీ మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో, షాద్ నగర్ అసెంబ్లీ.. మహ బూబ్ నగర్ లోక్ సభ పరిధిలో ఉంది. కల్వకుర్తి పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మం డలాలు నాగర్ కర్నూలు లోక్ సభ పరిధిలో ఉ న్నాయి. చేవెళ్ల లోక్ సభ పరిధిలో రంగారెడ్డి, వి కారాబాద్ జిల్లాలకు సంబంధించిన ఏడు అసెం బ్లీ స్థానాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ.. భువనగిరి లోక్ సభ పరిధిలో ఉంది. మల్కాజిగి రి, చేవెళ్ల అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు గా ఉండడంతో వీటి పరిధిలో పునర్విభజన సం దర్భంగా కొత్తగా ఎంపీ స్థానాలు ఎక్కువగానే ఏ ర్పడే అవకాశాలు ఉన్నాయి. రంగా రెడ్డి జిల్లాలో ఎంపీ స్థానాలు రెండు కొత్తగా ఏర్పడనున్నట్లు తెలిసింది. పెరిగే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతో ఎవరికి లాభం?. ఎవరికి కలిసొస్తుంది!. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. డీలిమిటేషన్ తర్వాత చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి రానుండడంతో అతివలకు రాజకీయ ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరగనున్నది.






