ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ఉపవాస దీక్ష

by Chintha Aamani |

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాలలో ఫ్యాకల్టీ కోసం విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది.

ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ఉపవాస దీక్ష
X

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాలలో ఫ్యాకల్టీ కోసం విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి పచ్చి నీళ్లు, తిండి తిప్పల లేకుండా గురుకుల ఆవరణలో ఎండలో దీక్ష కొనసాగుతూనే ఉంది. జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఫ్యాకల్టీ కి సకాలంలో వేతనాలు చెల్లించి, మాకు విద్యాబోధన అందించేలా చూడాలని కోరారు. ( ఫ్యాకల్టీని) అధ్యాపకులను నియమిస్తే తప్ప ధర్నా విరమింపమని భీష్మించుకు కూర్చున్నారు. సమస్యలు పరిష్కరించి ఫ్యాకల్టీ ని నియమిస్తే తప్ప మంచినీరు, భోజనం చేస్తామని విద్యార్థులు ముక్త కంఠం గా తెలిపారు.

పరిగి గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలలో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపాధ్యాయుల కోసం ఉపవాస దీక్ష చేస్తున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి చేరుకున్నారు . విద్యార్థుల ధర్నాన్ని చూసి విస్తు పోయారు. ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు 6 గంటలపాటు ఉపవాస దీక్ష చేపట్టిన కూతవేటు దూరంలో ఉన్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకర విషయమని ఎండలో ధర్నా చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద చూస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల కోసం విద్యార్థుల ఉపవాసం .. ఏడు గంటలుగా కొనసాగుతున్న దీక్ష కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్న ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం ఏంటంటూ మండిపడుతున్నారు. ఇలా నెలల తరబడి ఫ్యాకల్టీ లేకుండా డిజిటల్ బోధనలు వింటూ ఇక్కడ చదవడం ఏంటంటూ విద్యార్థులు పాఠశాల వదిలి ఇంటి ముఖం పట్టారు.

Next Story