- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూగజీవాలపై కుక్కల దాడి
by S Gopi |
మూగజీవాలపై కుక్కలు దాడి చేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని... Stray dogs attack sheep

X
దిశ, కేశంపేట్: మూగజీవాలపై కుక్కలు దాడి చేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని చింతకుంటపల్లి గ్రామానికి చెందిన అనేమోని సత్తయ్య యాదవ్ కు చెందిన గొర్ల కొట్టంలో ఉన్న గొర్రెలు, మేకలపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో ఐదు గొర్రె పిల్లలు, మూడు గొర్రెలు, రెండు మేకలు మృతిచెందాయి. మూగజీవాలు మృతి చెందడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్టు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. మూగజీవాలపై కుక్కలు దాడి చేసిన విషయాన్ని తెలుసుకుని గొర్ల కొట్టం వద్దకు వెళుతున్న సత్తయ్య తండ్రి వెంకటయ్యపై కూడా శుక్రవారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో వెంకటయ్యకు గాయాలయ్యాయి. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నివారణకు గ్రామపంచాయతీ పాలకవర్గంతోపాటు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Tags
- Stray dogs
- Goats
Next Story






