హంగ్‌కే అవకాశం...శుక్రవారం తేలనున్న ఫలితం

by velandi.Saikiran |

షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఎన్నిక ల సమరం ముగిసింది. ఓటర్లు తమ ఓటుతో అభ్య ర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశా రు.

హంగ్‌కే అవకాశం...శుక్రవారం తేలనున్న ఫలితం
X

దిశ, షాద్‌నగర్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఎన్నిక ల సమరం ముగిసింది. ఓటర్లు తమ ఓటుతో అభ్య ర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశా రు. ప్రచారం వాడివేడిగా నిర్వహించి, లక్షల రూ పాయలను ఖర్చుపెట్టి తాయిలాలతో ఓటర్లను ప్రస న్నం చేసుకోవాలని ప్రయత్నించిన అభ్యర్థుల భవిత వ్యం శుక్రవారం తేలనుంది. బుధవారం సాయం త్రం పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓటర్లు ఎవ రి వైపు మొగ్గు చూపారోనని లెక్కలు వేస్తూ అభ్యర్థు లు టెన్షన్ టెన్షన్‌గా గడుపుతున్నారు. మున్సిపల్ ఎ న్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీ ల నాయకులు సమావేశాలు, రోడ్ షోలు, ఇంటిం టి ప్రచారాలను కేంద్ర, రాష్ట్ర మంత్రులచే ని ర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

హంగుకే అవకాశం..

షాద్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులలో జరిగిన ఎన్ని కల సరళిని పరిశీలిస్తే హంగుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి పొందేందుకు ఏ ఒక్క పార్టీ సరిపడా సీట్లను సా ధించేలా కనిపించడం లేదని తెలిసింది. కాం గ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తడబడడం ఓ కారణమని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచా రంలో మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాన్ని రక్తి కట్టించేందుకు ప్రయత్నించి, వాదన లు, స వాళ్ళతో మొదలైన ప్రచారం విలువలకు తిలోదకాలు వదులుతూ వ్యక్తిగత దూషణలకు ది గడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

కాంగ్రెస్‌కు మైనెస్.. బీఆర్ఎస్‌కు ప్లస్..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్న య్యకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ తిరస్కరించడం, ప్రచారంలో చెన్నయ్య మౌనం వ హించడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలి గించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమాగా ఉన్నా రు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అభివృద్ధి మాతోనే సాధ్యం అంటూ అవకాశం ఇవ్వాలంటూ ఓ టర్లను ఓటు కోసం అభ్యర్థించారు. బీఆర్ఎస్ నా యకులు అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాల కే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రత్యర్థి పార్టీ వ్యూహాలకు చెక్ పెడుతూ చాపకింద నీరుల పనిచేసుకు పోవ డం పార్టీకి కలిసోచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో షాద్‌నగర్ మున్సిపాలిటీ అ న్ని విధాల అభివృద్ధి చెందిందని, తమకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలను బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలను కోరారు. తమ హయాంలో చేసిన అభివృద్దే తమకు విజయాన్ని కట్టబెడుతుందని బిఆర్ఎస్ నాయకులు ధీమాగా ఉన్నారు.

బీజేపీ లీడర్ల మధ్య లేని సయోధ్య..

మున్సిపాలిటీలో బీజేపీ క్యాడర్ బాగున్నా లీడర్ల మ ధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ప్రజలలో బీజేపీపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో బీజేపీ నాయకులు విఫలమయ్యారనే వాదన లు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో ఒకటి రెండు వార్డులలో గట్టి పోటీని ఇస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్నారు. మూ డు పార్టీల ప్రచార సరళిని గమనించిన ఓటర్లు తమ తీర్పును, అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్‌లో నిక్షిప్తం చేశారు. ఓట రు ఎవరికి పట్టం కట్టారో శుక్రవారం తేలనుంది.

Next Story