గురునానక్ విద్యా సంస్థలో సందడి చేసిన సినీ తార శ్రీలీల

by Ratna Kumari |

గురునాన‌క్ ఇన్ స్టిట్యూష‌న్స్ లో టెక్నో క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ “బ్రూమస్ ఫియెస్టా 2026 ” నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ప్ర‌ముఖ న‌టి శ్రీలీల హాజ‌ర‌య్యారు.

గురునానక్ విద్యా సంస్థలో సందడి చేసిన సినీ తార శ్రీలీల
X

దిశ, ఇబ్రహీంపట్నం : గురునాన‌క్ ఇన్ స్టిట్యూష‌న్స్ లో టెక్నో క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ “బ్రూమస్ ఫియెస్టా 2026 ” నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ప్ర‌ముఖ న‌టి శ్రీలీల హాజ‌ర‌య్యారు. ఈ పోటీలో విజేత‌ల‌కు, ర‌న్న‌ర్ అప్ గా నిలిచిన విద్యార్థుల‌కు ఆమె బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం ప‌లువురు విద్యార్థులు శ్రీలీల‌తో సెల్పీలు దిగారు. శ్రీలీల రాక‌తో గురునాన‌క్ క‌ళాశాల‌లో ఓ జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది. బ్రూమోస్ ఫెస్ట్ ను గురునాన‌క్ యూనివ‌ర్సిటీ ఛాన్స్ ల‌ర్ స‌ర్దార్ గ‌గ‌న్ దీప్ సింగ్ కోహ్లీ ప్రారంభించారు. విద్యార్థులకు తమ జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకతను అభివృద్ధి చేసుకునేందుకు ఇలాంటి వేదికలను వినియోగించుకోవాలని తెలిపారు ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్టర్ డా. ఎస్. శ్రీనాథ రెడ్డి, ప్రిన్సిపల్ డా. బి. వెంకటరమణ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ డా. రిషి సయాల్, కోఆర్డినేటర్లు డా. సందీప్ పాటిల్, డా. సురేందర్ రావు, డా. విజయలక్ష్మి , కల్నల్ రిటైర్డ్ ఎం చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.

Next Story