నేనింతే..! వివాదాలకు కేరాఫ్‌గా రోహిత్ రెడ్డి

by velandi.Saikiran |

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మె ల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌‌గా మారారు. మొదటి నుంచి ఆయన ఫాంహౌస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వ స్తోంది.

నేనింతే..! వివాదాలకు కేరాఫ్‌గా రోహిత్ రెడ్డి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వివాదాలకు కేరాఫ్‌‌గా మారారు. మొదటి నుంచి ఆయన ఫాంహౌస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వ స్తోంది. ఇప్పటి వరకు జరిగిన అనేక ఘటనలు ఆయన రాజకీయ ప్రస్థానానికి అడ్డంకిగా మారకపోయినా.. తాజాగ బిగుస్తున్న డ్రగ్స్​కేసు మా త్రం ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం లో పడేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకు లు పేర్కొంటున్నారు. డ్రగ్స్​‍ ఉదంతంలో రెడ్‌ హ్యాండెడ్‌‌గా పట్టుబడడం ఆయనకే గాక.. బీఆర్‌ ఎస్ పార్టీ ఇమేజ్‌‌ను సైతం డ్యామేజ్‌ చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు సైతం కొత్త అస్త్రం దొరికింది. తాండూరు నేతలే కాదు.. రాష్ట్ర స్థాయి నేతలు సైతం డ్రగ్స్​‍ఇష్యూనే ఆధా రంగా చేసుకుని బీఆర్‌ఎస్ పై విమర్శల పర్వాన్ని సాగిస్తున్నారు.

తరచుగా వార్తల్లో నిలుస్తున్న ‘పైలెట్‌’..

తాండూరు మాజీ ఎమ్మెల్యే తరచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలుస్తూ వస్తు న్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎ మ్మె ల్యేల కొనుగోలు కేసు డీల్‌ మొయినాబాద్‌‌లోని పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌‌లోనే జరిగింది. ఆతర్వాత కూడా ఒకటి, రెండు సార్లు డ్రగ్స్ విష యంలో పోలీసులు పైలెట్‌‌కు సంబంధించిన ఈ ఫామ్‌ హౌస్‌లో సోదాలు చేసినట్లు తెలిసింది. తాజాగ..రెండు రోజుల క్రితం ఇదే ఫాం హౌస్‌ లో జరిగిన డ్రగ్స్​‍పార్టీలో రోహిత్‌ రెడ్డి రెడ్‌ హ్యాం డెడ్‌‌గా పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్‌ ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటం కం కలిగించారన్న కారణంతో పోలీసులు రోహి త్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్‌‌పై ఉన్నారు. గతంలో బెంగళూ రు డ్రగ్స్‍ కేసులో పైలెట్‌ రోహిత్‌ రెడ్డి హస్తం ఉందన్న ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగిం ది. పైలెట్‌‌కు సంబంధించిన ఆస్తులు, విద్యార్హతలపై ఎన్‌ఫోర్స్‍ మెంట్‌ డైరెక్టరేట్‌ గతంలో రోహిత్‌ రెడ్డికి నోటీసులు సైతం జారీ చేసింది. ఇలా.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో పైలెట్‌ రోహిత్‌ రెడ్డి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

ఇరకాటంలో బీఆర్‌ఎస్ పార్టీ..

బీఆర్‌ఎస్ పాలనలో అప్పటి నేతలు డ్రగ్స్​‍దందా ను పెంచి పోషించారని అధికార కాంగ్రెస్ తర చుగా ఆరోపిస్తూ వస్తోంది. డ్రగ్స్​ ‍దందాలో బీఆ ర్‌ఎస్ అగ్ర నేతలకు సంబంధం ఉందని స్వయం గా సీఎం రేవంత్‌ రెడ్డి అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి డ్రగ్స్​ ‍పార్టీలో పట్టుబడడం బీఆర్‌ఎస్‌కు మింగుడుపడని అంశమనే చెప్పా లి. ఇదే అదనుగా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ పా ర్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు అంతా డ్రగ్స్​‍ టెస్టులు చేసుకుందామని, కేటీఆర్‌ డ్రగ్స్ ​‍పరీక్షకు సిద్దపడాలని పీసీసీ ప్రె సిడెంట్‌ మహేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. డ్ర గ్స్​‍దందాను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ తీరు ను నిరసిస్తూ గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ఆదివా రం గాంధీ భవన్‌‌లో డ్రగ్స్​‍ ఉదంతంపై విలేకరులతో మాట్లాడారు.

పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన డ్రగ్స్​‍పార్టీ వెనుక పెద్ద మాఫి యా ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచా రణ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రతినిధిగా సమాజానికి ఇచ్చే మెస్సేజన్‌ ఇ దేనా! అంటూ సోషల్‌ మీడియాలోనూ పైలెట్‌ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్​ కేసులో పెద్దల పాత్రను కూడా తేల్చాల్సిన అవసరం ఉం దని కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేస్తుండడంతో ఇది ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో అన్నది కూడా హాట్‌ టాపిక్‌‌గా మారింది. మొయినాబా ద్‌ డ్రగ్స్​ కేసు బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తుండడంతో రోహిత్‌ రెడ్డిని పార్టీ నుంచి స స్పెం డ్‌ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి రాజ కీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయ మన్న చర్చ జరుగుతోంది.

Next Story