- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తాండూరు : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వద్ద శనివారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల చెందిన 36 లబ్ధిదారులకు రూ.16 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి సహాయ నిధితో నేడు నిరుపేదలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని తెలిపారు. నిరుపేదల ఆరోగ్యం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం సహాయనిధి పేదలకు ఆసరాగా నిలిచి ప్రాణాలను కాపాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిల, పట్టణ అధ్యక్షుడు హాభీబ్ లాల, ఎల్మకన్నా సొసైటీ చైర్మన్ రవి గౌడ్,మాజీ జడ్పిటిసిలు దారా సింగ్, శ్రీనివాస్ రెడ్డి, నావండ్గి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మాణిక్ రెడ్డి, మాధవరెడ్డి, సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.






