- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం లక్ష్మీనారాయణ రైస్ మిల్లు, ఐకేపీ సెంటర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు, జనగణనకు సంబంధించి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

దిశ, యాలాల : ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం లక్ష్మీనారాయణ రైస్ మిల్లు, ఐకేపీ సెంటర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు, జనగణనకు సంబంధించి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో భాగంగా లక్ష్యంగా పెట్టుకున్న ధాన్యాన్ని అన్ లోడింగ్ చేయాలని, లారీలు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని.. ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. యాలాల్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. లారీలు ఎన్ని వస్తున్నాయని ఆరా తీశారు.
లక్ష్మీనారాయణ పూర్ లో శ్రీ బాలాజీ రైస్ మిల్ ను సందర్శించారు. ధాన్యం కొనుగోలు స్టాక్ వివరాలను మిల్ యజమానితో వివరాల పై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాన్యం కొనుగోలు చేసి తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. యాలాల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న జన గణన ప్రక్రియ నమోదును పరిశీలించారు. జనగణన నమోదు లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టి కి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. మండలం లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నా బార్డ్ నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులు టాయిలెట్ల, అదనపు గదులు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి రేణుకదేవి, తాండూర్ ఆర్డీవో అనిత, యాలాల తహశీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజ, డీ. టీ. కిరణ్ కుమార్, ఆర్ఐ. శివ చరణ్, ఎంపీవో ఆనంద్ రావు, డీఎం సి ఎస్ మోహన్ కృష్ణ , డి ఎస్ ఓ సుదర్శన్, మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు






