రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

by velandi.Saikiran |

రేషన్ కార్డు జారీ పక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రేషన

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
X

దిశ, మర్పల్లి: రేషన్ కార్డు జారీ పక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రేషన్ షాపులో నూతనంగా మంజూరైన రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్నబియాన్ని స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు కడుపు నిండా తృప్తిగా తినాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడద్దని చెప్పారు. పేదల అభివృద్ధి సంక్షేమమే ముఖ్య లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడెం రాములు యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story