క‌న్న కూతురి పై క‌సాయి తండ్రి లైంగిక దాడి

by Ratna Kumari |

కన్న కూతురి పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కసాయి తండ్రికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

క‌న్న కూతురి పై క‌సాయి తండ్రి లైంగిక దాడి
X

దిశ, ఇబ్రహీంపట్నం : కన్న కూతురి పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కసాయి తండ్రికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవినాష్ సాహ్ని (42), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబ‌ట్లలో నివాసం ఉంటున్నాడు. ఆయన తన సొంత కూతురు(14) పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు 2023 లో తల్లి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, మరుసటి రోజే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ప్రస్తుత సీఐ బి. రవి కుమార్, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, పోలీస్ కానిస్టేబుల్ లింగమయ్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచి, నిందితుడిపై నేరం రుజువు కావడానికి సహకరించారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన స్పెషల్ సెషన్స్ కోర్టు ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో కేసుల న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.12 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ కేసులో సమర్థవంతంగా పని చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story