లండన్ లో మృతి చెందిన చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సబితా

by velandi.Saikiran |

విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చైతన్య కుటుంబ సభ్యుల ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా

లండన్ లో మృతి చెందిన చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సబితా
X

దిశ, మీర్ పేట్ : విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చైతన్య కుటుంబ సభ్యుల ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు పరామర్శించి ధైర్యం చెప్పారు. బుధవారం బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్ గుల్ కు చెందిన తర్రే ఐలయ్య యాదవ్, తర్రే మంగమ్మల చిన్న కుమారుడు చైతన్య యాదవ్ ఆదివారం రోజు యునైటెడ్ కింగ్డమ్ లండన్ లో వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. /ఇక‌ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు కృషి చేస్తామని నాయకులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Next Story