- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏకగ్రీవ సర్పంచ్ కోసం రూ. 30 లక్షల ఆఫర్.. వికారాబాద్ జిల్లాలో యువకుడి ప్రకటన
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లిలో సర్పంచ్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లిలో సర్పంచ్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపేందుకు ఒక యువకుడు ప్రకటించిన భారీ ఆఫర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన యువకుడు యాదవ రెడ్డి, తనను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులను కేటాయిస్తానని ప్రకటించారు. ఈ నిధులలో రూ.10 లక్షలు హనుమాన్ మందిర అభివృద్ధికి, రూ.6 లక్షలు మైనారిటీ, క్రిస్టియన్ సంక్షేమ కార్యక్రమాలకు, అలాగే రూ.2 లక్షలు అత్యవసర అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో అందిస్తానని వెల్లడించారు.
ఈ మేరకు యాదవ రెడ్డి గురువారం ఒక వీడియో విడుదల చేశారు. గతంలో ఎంతో మంది సర్పంచ్‌లు అయ్యారని, కానీ వారు అభివృద్ధి కోసం కాకుండా వారి స్వార్థం కోసం మాత్రమే పని చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కొత్త తరం చూసేందుకు తాను ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలు డొనేట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, సర్పంచ్ ఎన్నికల్లో ఇలాంటి ఆఫర్ ప్రకటించడంతో గ్రామంలో రాజకీయ చర్చలు వేడెక్కగా, స్థానికులు ఆయన ప్రకటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. వీడియో ఇదే..






