ఓపిక పట్టండి ప్లీజ్‌!

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి జిల్లాలో భూ భారతి దరఖాస్తులు నెలల తరబడిగా పెండింగులోనే ఉ న్నాయి. పరిష్కారం కోసం నిత్యం కలెక్టరేట్‌కు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.

ఓపిక పట్టండి ప్లీజ్‌!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో భూ భారతి దరఖాస్తులు నెలల తరబడిగా పెండింగులోనే ఉ న్నాయి. పరిష్కారం కోసం నిత్యం కలెక్టరేట్‌కు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే రేపు.. మాపు పరిష్కరిస్తాం అంటూ ఆ అధికారి అందరిలా మభ్యపెట్టాలని అనుకోలేదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఫైల్స్​‍ క్లియరెన్స్​‍కు కాస్త సమయం ఇవ్వండని విజ్ఞప్తి చేస్తూ కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పా టు చేశారు. రెవెన్యూ విభాగం అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి తన ఛాం బర్‌ ఎదుట ఏర్పాటు చేసిన విజ్ఞప్తికి పలువురు ఫిదా అవుతున్నారు.

అసలు విషయం ఏంటంటే..?

ఏళ్ల తరబడిగా ఆపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఇందు లో భాగంగా గత జూన్‌‌లో భూ భా రతి సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిం ది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండ లాల్లో 613 రెవెన్యూ సదస్సులు ని ర్వహించగా.. 21,200 దరఖాస్తు లు అధికారులకు అందాయి. అత్యధికంగా మంచాల మండలంలో 2,459 దరఖాస్తులు, యాచారం మండలంలో 1,867 దరఖాస్తులు, కందుకూరు మండలంలో 1,863 దరఖాస్తులు రాగా..అత్యల్పంగా రా జేంద్రనగర్‌లో 7, హయత్‌ నగర్‌ లో 3 దరఖాస్తులు వచ్చాయి. దీనికితోడు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలోనూ భూ సం బంధిత దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, తహశీల్దార్ల లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్‌ చేస్తూ వస్తున్నారు.

దరఖాస్తుల క్లియరెన్స్​‍కు ఆగస్ట్ 15 డెడ్‌లై న్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. ఇ క్కడ అదనపు (రెవెన్యూ) కలెక్టర్‌గా పనిచేసిన భూపాల్‌ రెడ్డి గతేడాది ఆగస్టులో ఏసీబీకి పట్టుబడగా.. ఆ పోస్టు ఖాళీగానే ఉంది. స్థానిక సం స్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమా సిం గ్‌కు రెవెన్యూ బాధ్యతలను అప్పగించారు. అయితే ఆమె పని ఒత్తిడి తో భూ భారతి దరఖాస్తులను పరిష్కరించలేకపోయారు.దీంతో ఆమె లాగిన్‌లో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌‌లోనే ఉండిపోయాయి. నిత్యం బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను అభ్యర్థిస్తున్నా రు. రేపు మాపు అంటూ అధికారు లు చెబుతున్న మాటలతో బాధితు లు అసహనంతో ఉన్నారు. అయితే హెచ్‌ఎండీఏ బుద్ద పూర్ణిమ ప్రాజె క్టు ఓఎస్డీగా పనిచేస్తున్న చంద్రారెడ్డిని అదనపు(రెవెన్యూ) కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నెల 4న ఆయన బాధ్యతలు స్వీకరించా రు. నిత్యం ఆయన ఛాంబర్‌కు ప్రజ లు వచ్చి దరఖాస్తుల గురించి వాక బు చేస్తుండడంతో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తన కార్యాలయం ఎదుట బోర్డును ఏర్పాటు చేశారు. ఆగస్టు 4 నాటికి 4,600 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వాటని క్లియర్‌ చేయడానికి సమయం కావాలని ఆ ప్రకటనలో అభ్యర్థించారు. దయచేసి కొంచెం ఓపిక పట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు.

Next Story