- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య, కొడుకును హత్య చేసిన వ్యక్తిని రిమాండ్ కి తరలింపు
by Ratna Kumari |
కట్టుకున్న భార్యను, కొడుకును హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

X
దిశ, ఆమనగల్: కట్టుకున్న భార్యను, కొడుకును హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 31న రాత్రి ఆమనగల్ మండలం సీతారాం నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పులిగొని పల్లి తండాలో బాణావత్ రాందాస్.. భార్య కవిత (28), కుమారుడు హర్ష రోహిత్ (09)లను రోకలిబండతో తలలపై బలంగా కొట్టాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఏసీపీ జానకి రెడ్డి మార్గదర్శకత్వంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సీతారాంరెడ్డి, సిబ్బంది నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






