సీఈఐఆర్ పోర్ట‌ల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రిక‌వ‌రీ

by Ratna Kumari |

మోమిన్ పేట్ పోలీస్ ఆధ్వ‌ర్యంలో సీఈఐఆర్ (Central Equipment Identity Register) పోర్ట‌ల్ స‌హాయంతో పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్ల‌ను గుర్తించి బాధితుల‌కు అప్ప‌గించారు.

సీఈఐఆర్ పోర్ట‌ల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రిక‌వ‌రీ
X

దిశ‌, మోమిన్ పేట్ : మోమిన్ పేట్ పోలీస్ ఆధ్వ‌ర్యంలో సీఈఐఆర్ (Central Equipment Identity Register) పోర్ట‌ల్ స‌హాయంతో పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్ల‌ను గుర్తించి బాధితుల‌కు అప్ప‌గించారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీస్ శాఖ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించి సీఈఐఆర్ పోర్ట‌ల్ ద్వారా మొబైల్ ఫోన్ల‌ను ట్రేస్ చేసి రిక‌వ‌రీ చేశారు. రిక‌వ‌రీ చేసిన మొబైల్ ఫోన్లను వాటిపై య‌జ‌మానుల‌కు అంద‌జేశారు. పోగొట్టుకున్న ఫోన్ బాధితుల వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


1. అంతగల్లా ఆనందం గ్రామం టేకులపల్లి -మొబైల్ ఫోన్ VIVO (22/05/2024)

2. గొల్ల నర్సింలు గ్రామం టేకులపల్లి మొబైల్ ఫోన్- OPPO (04/03/2026)

3. కొంటోళ్ల అశోక్ గ్రామం వెంచర్ మొబైల్ ఫోన్ -OPPO (03/07/2025)

4. దాస ప్రకాష్ గ్రామం మురంగపల్లి మొబైల్ ఫోన్- OPPO (04/05/2026)

5. గిరి నితిన్ గ్రామం కేసారం మొబైల్ ఫోన్- REDMI (29/11/2024)

6. కుమ్మరి రాములు గ్రామం కొత్లపూర్ మర్పల్లి మండలం మొబైల్ ఫోన్- Samsung (02/05/2026)

ఈ సంద‌ర్భంగా ఎస్సై మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సీఈఐఆర్ పోర్ట‌ల్ లో ఫిర్యాదు న‌మోదు చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ. 1,10,0000/- గా ఉంటుంది. ఫోన్ల రిక‌వ‌రీలో కీల‌కంగా ప‌ని చేసిన సిబ్బంది మ‌ల్లేశ్వ‌రి, మ‌హేష్ కుమార్ ను ఎస్సై భ‌ర‌త్ భూష‌ణ్ అభినందించారు. సీఈఐఆర్ ద్వారా ఓ మ‌హిళా అదృశ్యం కేసు కూడా ఛేదించిన‌ట్టు ఎస్సై భ‌ర‌త్ భూష‌ణ్ తెలిపారు.

Next Story