- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతికి పునర్జన్మ
గర్భస్రావం అనంతరం తలెత్తిన అరుదైన ప్రాణాపాయకర సమస్య నుంచి 32 ఏళ్ల యువతిని మెడికోవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా రక్షించారు.

దిశ, గండిపేట : గర్భస్రావం అనంతరం తలెత్తిన అరుదైన ప్రాణాపాయకర సమస్య నుంచి 32 ఏళ్ల యువతిని మెడికోవర్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా రక్షించారు. ప్రాణాలు కాపాడటంతో పాటు గర్భాశయాన్ని సంరక్షించి, భవిష్యత్ మాతృత్వ అవకాశాన్ని నిలబెట్టారు. మిస్డ్ అబార్షన్ తర్వాత డీఅండ్ సీ చేయించుకున్న బాధితురాలు 25 రోజుల పాటు నిరంతర రక్తస్రావంతో ఆస్పత్రికి చేరుకుంది. అధునాతన ఏంఆర్ఐ పరీక్షల్లో గర్భాశయంలో ఆర్పీఓసీ యుటెరైన్ ఏవీఎం, పాత సిజేరియన్ మచ్చ వద్ద స్కార్ నిచ్ వంటి మూడు క్లిష్ట సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు దశలవారీ చికిత్స చేపట్టారు. ముందుగా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. సాయి తేజ యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా రక్తస్రావ ప్రమాదాన్ని తగ్గించారు. అనంతరం గైనకాలజికల్ సర్జన్ డా. పేరం పృథ్వి మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్సతో మిగిలిన కణజాలాన్ని తొలగించి, గర్భాశయ పొరను సరిచేశారు. సాధారణంగా హిస్టరెక్టమీ అవసరమయ్యే పరిస్థితిలో మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో గర్భాశయాన్ని కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.






