మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితునికి రిమాండ్

by Ratna Kumari |

మైన‌ర్ బాలిక పై అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుడిని రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు మోమిన్ పేట్ సీఐ వెంక‌ట్ తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితునికి రిమాండ్
X

దిశ, మోమిన్ పేట్ : మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోమిన్ పేట మండల పరిధిలో నివసించే ఒక మైనర్ బాలిక ( ఏడో తరగతి) గత సంవత్సరం దీపావళి సెలవుల సమయంలో వసతి గృహం నుంచి ఇంటికి వచ్చి హాస్టల్ కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటుంది. ఆమె అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె గర్భవతి అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్టు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మోమిన్ పేట పోలీసులు వికారాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్నేహ మెహ్ర డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి నిందితుడని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.


నిందితుడు సైదలిపూర్ గ్రామానికి చెందిన ఉద్దల మాణిక్యంగా గుర్తించారు. ఈనెల 9వ తేదీన నిందితుడిని అరెస్టు చేసి జ్యూడిషల్ డిమాండ్ కి పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ మాట్లాడుతూ మైనర్ బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రుల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు వసతిగృహం లేదా పాఠశాలలకు వెళ్లే సందర్భాల్లో వారి రాకపోకలపై తగిన పర్యవేక్షణ చేయాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి లేదా 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు.

Next Story