- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాష్‌రూంలో లంచం!
రంగారెడ్డి జిల్లాలోని తహశీల్ధార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ఇటీవల కాలంలోనే వరసగా రెండు ఏసీబీ దాడులు చోటు చేసుకున్నాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో/తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తహశీల్ధార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ఇటీవల కాలంలోనే వరసగా రెండు ఏసీబీ దాడులు చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిశ దినపత్రిక తహశీల్ధార్ కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలపై ఆధారాలతో సహా ప్రచురిస్తోంది. అయినప్పటికి అధికారుల్లో, సిబ్బందిలో మార్పు కనిపించకపోవడం గమనార్హం. ఆర్ఐలే కీలకంగా, ఆర్ఐల మీదే తహశీల్ధార్లు ఆధారపడుతున్నారనే కథనాలు కేస్‌స్టడీ ఆధారంగా అందించినా.. ఇవేమీ తమకు పట్టవు అన్నట్లుగా అధికారులు, సిబ్బంది వ్యవహరించడంతో ఏసీబీ ట్రాప్‌కు బలైపోతున్నారు. అలాగే మండల తహశీల్ధార్లు చేసే తప్పిదాలకు చిన్నస్ధాయి ఉద్యోగుల జీవితాలను ఆగం చేసుకునే దుస్థితి వచ్చింది. జిల్లాలోని పలు మండలాల్లో డాక్యుమెంట్ కో రేటు పెట్టుకొని కింది స్థాయిలోని ఆపరేటర్, అసిస్టెంట్లు, ఆర్ఐలతో తహశీల్ధార్లు రాయబారాలు నడిపిస్తున్నారు.
వారసులకు రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం...
తలకొండపల్లి తహశీల్ధార్ కార్యాలయంలో వంశపార్యంగా వస్తున్న భూములను ఆ కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం దారుణం. ఇలా ఎంతో మంది రైతుల వద్ద లక్షల రూపాయాలు వసూళ్లు చేసినట్లు మండల ప్రజలు వాపోతున్నారు. అయితే మంగళవారం అంతారం గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వృద్దురాలు తమ పిల్లలకు భూమి రిజిస్ట్రేషన్ చేయాలని తహశీల్ధార్‌ను అడిగింది. అందుకు తహశీల్ధార్ డాక్యుమెంట్‌కు రూ.2వేల చొప్పున ఇవ్వాలని, ఆ నగదు కూడా తమ అటెండర్‌కు ఇవ్వాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. భూ యాజమానులు తమ దగ్గర డబ్బులు లేవని తహశీల్ధార్‌కు చెప్పారు. దీంతో తహశీల్ధార్ సీరియస్‌గా ఇవ్వలేకపోతే రిజిస్ట్రేషన్ చేయలేను అని చేతిలోనున్న పేపర్లను విసిరేసినట్లు బాధితులు తెలిపారు. భూ యాజమానులకు సంబంధించిన 22 గుంటల భూమి ఆరుగురికి మార్పిడి చేయాల్సిన సమయంలో ఇలా ప్రవర్తించారు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు.
బాత్ రూమ్ లో లంచం ఇస్తుండగా..
రంగారెడ్డి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ ఆనంద్ నేతృత్యంలో 10 పోలీసులు కలిసి తలకొండపల్లి తహశీల్ధార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మంగళవారం బాధితులు ఫిర్యాదు మేరకు పక్క పథకం ప్రకారం తహశీల్ధార్ నాగర్జునను ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. తహశీల్ధార్ సూచించినట్లుగానే అటెండర్ యాదగిరికి రూ.10 వేలు పట్టాదారులు బాత్రూమ్లో లంచం ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకొని వివరాలు సేకరించారు. అయితే తహశీల్ధార్ ఆదేశాలతోనే నగదు తీసుకున్నట్లు అటెండర్ స్పష్టం చేశారు. దీంతో తహశీల్ధార్‌ను ఏసీబీ అధికారులు విచారణ చేసి కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. తహశీల్ధార్‌ను ఏ1గా, అటెండర్‌ను ఏ2గా చూపిస్తూ కేసు చేసినట్లు అధికారులు వివరించారు. తహశీల్ధార్ సొంత ఊరైన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వారి నివాసాల్లో, బంధువుల ఇండ్లల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
టాపాసులు కాల్చి స్థానికుల సంబరాలు
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో ఒక పక్క ఏసీబీ రైట్స్ కొనసాగుతుండగానే కార్యాలయం గేటు ముందు ఆయా గ్రామాల చెందిన కొంతమంది బాధితులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ప్రతి నిత్యం కార్యాలయానికి వచ్చే రైతుల పట్ల తహశీల్దార్ డబ్బులు వసూలు చేస్తూ పలుమార్లు ఇబ్బందులకు గురి చేసేవాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.






