- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
3 టేబుల్స్ ..13 రౌండ్స్.. 6 మున్సిపాలిటీల్లో నేడే ఓటరు తీర్పు
కొద్దిసేపటిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి అభ్యర్థుల భవితవ్యం తేలనుండగా.. జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్దమైంది. మరి కొద్ది గంటల్లో ఓటరు తీర్పు వెల్లడి కానుంది. 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల బరిలో ఉన్న 437 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఆరు కేంద్రాల్లోని 7 హాల్లలో ఓట్ల లెక్కింపునకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్ర తను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఫోర్త్ సిటీ కమిషనర్ సుధీర్ బాబులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండు, మూ డు రౌండ్లలోనే వార్డుల ఫలితాలు వెలువడనున్నా యి. 20వేల లోపు ఓట్లు ఉన్న మున్సిపాలిటీలలో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడనుంది. అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్న మున్సిపా లిటీల తుది ఫలితం మధ్యాహ్నం 3 గంటల వరకు తెలిసే అవకాశం ఉంది.
అభ్యర్థుల్లో లబ్..డబ్..
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డుల బరిలో మొత్తం 437 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్‌ఎస్ నుంచి 122 మంది, బీజేపీ నుంచి 109 మంది, జనసేన నుంచి 9 మంది, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఐ, సీపీఎం నుంచి ఇద్దరు చొప్పున, ఎంఐఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు, స్వతంత్రులు 57 మంది పోటీ పడుతున్నారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొ త్తం 1,76,023 ఓటర్లగాను 1,39,044 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఇందులో పురుషులు 68,725, మహిళలు 70,318, ఇతరులు ఒకరు ఓటింగ్‌లో పాల్గొన్నా రు. ఓటరు మదిలో ఏముంది? ఎవరికి మద్దతు పలుకుతారో! అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. గెలిస్తే సరి! ఓడిపోతే పరిస్థితి ఏంటి? అన్న ఆందో ళన అందరిలోనూ నెలకొంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత..
ఆమనగల్ మున్సిపల్ కౌంటింగ్‌ను బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో, చేవెళ్ల మున్సిపల్ కౌంటిం గ్‌ను ఫరా ఇంజినీరింగ్ కాలేజ్‌లో, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌంటింగ్‌ను శ్రీఇందు ఇంజినీరింగ్ కాలేజ్‌లో, మొయినాబాద్ మున్సిపల్ కౌం టింగ్‌ను చిలుకూరులోని మాక్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిలో, షాద్‌నగర్ మున్సిపల్ కౌంటింగ్‌ను మినీ స్టేడియంలో, శంకర్‌పల్లి మున్సిపల్ కౌం టింగ్‌ను మున్సిపల్ ఆడిటోరియం బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూంల నుంచి పటిష్ట భ ద్రత నడుమ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రా లకు తరలించి సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపును మొదలు పెడతారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 64 మంది సూపర్ వైజర్లు, 128 మంది అసిస్టెంట్లు లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. అదనంగా మరో 27 మంది సూపర్ వైజర్లను, 46 మంది అసిస్టెంట్లను కౌంటింగ్ కేం ద్రాల్లో అందుబాటులో ఉంచారు. 47 మంది ఆర్ వోలు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. బ్యాలె ట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్ కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
క్యాంపు రాజకీయాలు!..
16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ను నిర్వహించనున్నారు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని చోట్ల నువ్వా? నేనా! అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరికీ మెజార్టీ రాక హంగ్ వచ్చే పరిస్థితి వస్తే ఎలా?. అ న్న గుబులు రాజకీయ పార్టీలకు పట్టుకుంది. దీం తో బరిలో ఉన్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటు న్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడ్డ మరుక్షణం గెలిచిన అభ్యర్థులను ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలించేందు ప్రయత్నాలు జరుగుతున్నాయి.






