- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే కొడంగల్ లో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సమావేశం.. సీఎం హాజరయ్యే అవకాశం?
కొడంగల్ లో రేపు జరగనున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారా? లేదా? అనే దానిపై ఉత్కంత నెలకొంది.

దిశ, కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో రేపు (శనివారం) అత్యంత కీలకమైన నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొడంగల్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న మురారి ఫంక్షన్ హాల్‌లో రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కోడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేక అధికారి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కీలక సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. గౌరవ సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు అన్ని మండలాల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కోసం స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, రైతులు కూడా ఈ సమావేశానికి రానున్నారు.
సీఎం రాకపై ఉత్కంఠ:
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కీలక సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ సీఎం రాకపోతే, ఆయన సలహాదారు (CM Adviser) పాల్గొనే అవకాశం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో పాటు 'ప్రజా పాలన' సమీక్ష కాబట్టి, ఆయన రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






