ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

by Sumithra |
ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
X

దిశ, బషీరాబాద్ : తాండూర్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పీఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు దర్మిది వెంకట్ రామ్ రెడ్డి హాజరై పీఆర్టీయూ పతకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల్ పీఆర్టీయూ అధ్యక్షలు కార్యదర్శులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సంతోష్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story