పేద రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : ఎమ్మెల్సీ క‌విత

by Ratna Kumari |

దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని త్రిబుల్ ఆర్ సర్వే అలైన్మెంట్ మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతా

పేద రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : ఎమ్మెల్సీ క‌విత
X

దిశ, తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని త్రిబుల్ ఆర్ సర్వే అలైన్మెంట్ మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం జనం బాట కార్యక్రమంలో భాగంగా తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి రైతుల‌తో పాటు మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ తో మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాల‌ని.. ఎవ్వ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని మీ అంద‌రికీ అండ‌గా నిలుస్తాన‌ని హామి ఇచ్చింది ఎమ్మెల్సీ క‌విత‌. ప‌లువురు రైతులు అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను క‌విత‌కు వివ‌రించారు.

ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో రైతులకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జ‌న‌వ‌రి 05న రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రితో క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రిస్తాన‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా సన్న, చిన్నకారు రైతులకు అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆమె హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్, జంగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పసుల మల్లేష్, గడ్డమీద తండా మాజీ సర్పంచ్ ఈశ్వర్ నాయక్, ఉప సర్పంచ్ మంజుల, వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు శేఖర్ గౌడ్, రజిత రమేష్, కృష్ణయ్య, లక్ష్మమ్మ, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, నాయకులు తిరుపతి, యాదయ్య గౌడ్, జైపాల్ రెడ్డి, శంకరయ్య, రఘురాములు, ధర్మారెడ్డి, మధు, శ్రీరామ్, యాదయ్య, సుధాకర్, నందు, వంశీ పాల్గొన్నారు.

Next Story