ఫామ్‌హౌస్‌లో పేకాట.. ఎనిమిది మంది అరెస్ట్

by Ratna Kumari |

ఓ ఫామ్ హౌజ్ లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

ఫామ్‌హౌస్‌లో పేకాట..  ఎనిమిది మంది అరెస్ట్
X

దిశ, శంషాబాద్ : ఓ ఫామ్ హౌజ్ లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో హామీదుల్లా నగర్ లోని బటర్‌ఫ్లై ఫామ్‌హౌస్‌లో కొంతమంది వ్యక్తులు మూడు కార్డుల పేకాట ఆడుతూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం శంషాబాద్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పూజారి శ్రవణ్ కుమార్, కౌడి రిషికేష్, గ్యారా పురుషోత్తం, ఖరగర సాగర్ కుమార్, వడ్లూరి సాయి కుమార్, కటకం సాయికుమార్, యంజాల భరత్ కుమార్, మెరుగు బాలరామ్ ఆనంద్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఆలే రమేష్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.35 వేల నగదు, ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించిన ఎనిమిది సెల్‌ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ కే. నరేందర్ రెడ్డి వెల్లడించారు.

Next Story