- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిగిలో పెట్రోల్ కొరత.. అన్ని పెట్రోల్ పంపుల్లో నో స్టాక్
పరిగి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదంటూ నిర్వాహకులు, యాజమాన్యం చేతులెత్తేసారు. పరిగి లోని హెచ్ పి, ఇండియన్, భారత్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదంటూ చెప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దిశ, పరిగి : పరిగి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదంటూ నిర్వాహకులు, యాజమాన్యం చేతులెత్తేసారు. పరిగి లోని హెచ్ పి, ఇండియన్, భారత్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదంటూ చెప్పడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిగి లోని భవాని హోటల్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం ఉదయం నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు పెట్రోల్ డీజిల్ పోశారు. ఈ ఒక్క పంపు లోనే పెట్రోల్, డీజిల్ ఉందని తెలిసి వాహనదారులు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి 11. 20 నిమిషాల వరకు పెట్రోల్ డీజిల్ పోయడంతో మిషన్లు హిట్ ఎక్కాయంటూ పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్పారు. ఇప్పటివరకు పోసి ఇప్పుడే హీట్ ఎక్కాయా కావాలనే కృతిమ కొరత సృష్టిస్తున్నారా అంట వాహనదారులు పెట్రోల్ పంపు నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. పెట్రోల్, డీజిల్ ఉంది కానీ మిషన్లు హిట్ ఎక్కాయి అని, పెట్రోల్ డీజిల్ లేదని ఇలా రెండు మాటలు చెప్పడంతో భారత్ పెట్రోల్ బంక్ నిర్వాహకుల తీరుపై తప్పుపడుతున్నారు. ఆఫ్లైన్లో ఉన్న పంపును ఆన్లైన్లోకి చేయించి సేల్స్ ఆఫీసర్ కావాలని పంపును ఆఫ్ చేయించినట్లు తెలిసింది.






