గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట
X

దిశ, కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కుండ్రిగాని బోడ్ తండా లో బాణావత్ మేగ్య, రాములు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నూతన గా నిర్మాణమైన ఇల్లును శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల‌ పథకం నిరంత ప్రక్రియగా కొనసాగుతుందని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని ఇందిరా ఇండ్ల పథకం లబ్ధిదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇల్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కృష్ణారెడ్డి, పీడీ చంప్లా నాయక్, డీఈ శైలజ,ఏఎంసి వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో సుజాత, ఏఈ క్రాంతి, సర్పంచులు బిక్కు శారద నాయక్, రాయి కంటి బిక్షపతి, ఉపసర్పంచులు ఈ రెడ్డి యాదగిరి రెడ్డి, సభావత్ యశోద, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు బీచ్యా నాయక్, గురిగళ్ళ లక్ష్మయ్య, శీను, శంకర్, రామకృష్ణ, చందోజి,రమేష్,సేవ్య, బోస్ రవి,ఇమ్రాన్ బాబా, రాజేందర్ గౌడ్, రంగా,హరి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story