కొండగట్టుకు జనసేనాని.. వారాహికి ప్రత్యేక పూజలు

by Vinod kumar |   (  Updated:2023-01-16 11:43:55  IST  )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నిర్వహించే పొలిటికల్ యాత్రల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్రచార రథం "వారాహి" వాహన పూజ జనవరి 24న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో జరిపించేందుకు నిర్ణయించారు.

కొండగట్టుకు జనసేనాని.. వారాహికి ప్రత్యేక పూజలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నిర్వహించే పొలిటికల్ యాత్రల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్రచార రథం "వారాహి" వాహన పూజ జనవరి 24న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో జరిపించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను జారీ చేసింది. కొండగట్టుతో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉండటంతో అంజన్న చెంత వాహన పూజ చేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి దర్శనానంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి కావలసిన అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి అనుష్ఠుప్ నారసింహ యాత్ర (32 నరసింహా ఆలయాల సందర్శన యాత్ర) చేపడతారని ప్రకటనలో తెలిపారు.

Next Story