- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలకొండపల్లిలో ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లి మండల పరిధిలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పంచాయతీ కార్యదర్శి.

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లా పరిధిలోని తలకొండపల్లి మండల పరిధిలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పంచాయతీ కార్యదర్శి. స్థానికులు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.శరత్ ఇంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్స్ ను గ్రామపంచాయతీ రికార్డులలో పేరు మార్పిడి చేయడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. గత కొద్ది నెలల నుంచి పంచాయతీ కార్యదర్శి పలు ఇబ్బందులకు గురి చేస్తూ.. రూ.30వేలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుల నుంచి ఒప్పుకున్న డబ్బులు అడ్వాన్స్ కింద మంగళవారం రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామపంచాయతీ కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామసభ ముగిసిన వెంటనే ఏసీబీ అధికారులు అక్కడే ఉండి డబ్బులు తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శి శరత్ ను పథకం ప్రకారం పట్టుకున్నారు.






