MLA T. Rammohan Reddy : పరిగి మున్సిపాలిటీ చుట్టూ ఔటర్​ రింగ్​ రోడ్డు

by Sridhar Babu |

మున్సిపాలిటీ చుట్టూ ఔటర్​ రింగ్​ రోడ్డును ఏర్పాటు చేస్తూ, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​ రెడ్డి అన్నారు.

MLA T. Rammohan Reddy : పరిగి మున్సిపాలిటీ చుట్టూ ఔటర్​ రింగ్​ రోడ్డు
X

దిశ, పరిగి : మున్సిపాలిటీ చుట్టూ ఔటర్​ రింగ్​ రోడ్డును ఏర్పాటు చేస్తూ, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​ రెడ్డి అన్నారు. పరిగి ప్రజా భవన్ లో ఆయన మున్సిపల్ చైర్మన్​ ముకుంద అశోక్​ కుమార్​, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లతో మున్సిపల్​ అభివృద్దిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీలో రోడ్డు, రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు అధిక నిధులు కావాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని తెలిపారు. పరిగి మున్సిపాలిటీని మరింత విస్తృతపరిచి సమీప ప్రాంతాలు, గ్రామాలను కలిపి రాబోయే కాలంలో మున్సిపాలిటీ పరిధిని పెంచేటట్టు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పరిగి మున్సిపాలిటీకి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి డిజైనింగ్ నడుస్తుందన్నారు. త్వరలో అన్ని పార్టీల నాయకులతో చర్చించి ఔటర్ రింగ్ రోడ్డు

గురించి సూచనలు సలహాలు తీసుకుంటామన్నారు. ఈ అభివృద్దిపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అంతేకాకుండా త్వరలో రైల్వే లైన్ పనులు మొదలవుతాయని పరికి తుంకులు గడ్డ మీదుగా రైల్వే లైన్ వెళ్తుందని, అది పరిగి అభివృద్ధికి దోహదపడుతుందని గుర్తు చేశారు. నేవి రాడార్ పనులు, త్వరలో పరిగి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును నిర్మించి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వారు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణను తయారు చేయాలని కోరారు. పరిగి మున్సిపల్​ పరిధిలోని 4వ వార్డులో ఆదివారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, మున్సిపల్​ చైర్మన్​ ముకుంద అశోక్ కుమార్, కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు జరుపుల శ్రీనివాస్​, మునీర్​, వార్ల రవీంద్రా, నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కల్లు శ్రీనివాస్​ రెడ్డి, పరశురాంరెడ్డి, బాదాం శ్రీనివాస్​, మల్లేష్​, మౌలానా, ఎజాస్​, అక్బర్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story