- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రోజు సర్పంచ్‌కు 145, వార్డుకు 119 నామినేషన్లు
రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైం ది. నామినేషన్ల స్వీకరణకు ఆయా

నామినేషన్లు షురూ..
-మొదటి రోజు సర్పంచ్‌కు 145, వార్డుకు 119 నామినేషన్లు
-నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి
దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో తొలి విడుతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైం ది. నామినేషన్ల స్వీకరణకు ఆయా గ్రామ పంచాయతీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ను అభ్యర్థుల నుంచి స్వీకరించారు. తొలి విడతలో ఫరూఖ్‌నగర్, చౌదరి గూడెం, కే శంపేట, కొత్తూరు, కొందుర్గు, నందిగామ, శంషాబాద్ మండలాల్లోని 174 సర్పంచు స్థానాలకు, 1,530 వార్డులకు ఎన్నికలు జ రగనున్నాయి. మొదటి రోజు సర్పంచ్ స్థా నాలకు 145 దరఖాస్తులు, వార్డు స్థానాల కు 119 దరఖాస్తులు వచ్చాయి. 29 వరకు నామినేషన్ల స్వీకరించి 30న నామినేషన్ల పరిశీలన జరపనున్నారు. ఉప సంహరణకు డిసెంబరు 3 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 11న ఎన్నికలను నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
క్షుణ్ణంగా పరిశీలించాలి
జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అభ్యర్థి సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిం చి తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్ ప్రశాం త్ జీవన్ రిటర్నింగ్ అధికారులకు సూచిం చారు. మొదటి దశ పోలింగ్‌కు సంబంధిం చి గురువారం శంషాబాద్ మండలంలోని పెద్ద తుప్రా, పెద్ద తుప్రా తండా, ముచ్చింత ల్, మదనపల్లి గ్రామ పంచాయతీలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రి యను అబ్జర్వర్ పి.ప్రశాంత్ జీవన్.. జిల్లా కలెక్టర్ నారాయ ణ రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చే యాలని అబ్జర్వర్ సూచించారు. ప్రతి నా మినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పా టు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సి బ్బంది నామపత్రాలను దాఖలు చేసే సమ యంలో అభ్యర్థులకు అవసరమైన సహకా రం అందించాలని సూచిం చారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్ప కుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణం లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాం టి సందేహాలున్నా ఉన్నతాధికారులను సం ప్రదించాలని సూచించారు. జనరల్ అబ్జర్వ ర్ వెంట శంషాబాద్ ఎంపీడీవో మున్ని, త హశీల్దార్లు, అధికారులు ఉన్నారు.
సర్పంచ్ 30, వార్డులు 20 గుర్తుల కేటాయింపు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచు అభ్యర్థులకు 30 ఎన్నికల గుర్తులను కేటాయించింది. వీటిలో రింగు, కత్తె ర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, చెప్పులు, చెత్త డబ్బా, బి స్కెట్, బెండకాయ, టీజాలి, చేతిక ర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మెన్, తెరచాప, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, గాలి బుడగ వంటివి ఉన్నాయి. వార్డు అభ్యర్థులకు 20 గుర్తులను కేటాయించారు.
తొలి విడతలో ఎన్నిక వివరాలు
మండలం జీపీలు వార్డులు
ఫరూఖ్ నగర్ 47 410
చౌదరిగూడెం 24 204
కేశంపేట 29 260
కొత్తూరు 12 110
కొందుర్గు 22 186
నందిగామ 19 170
శంషాబాద్ 21 190
మొత్తం 174 1,530
తొలి రోజు దరఖాస్తులు
మండలం జీపీలు వార్డులు
ఫరూఖ్ నగర్ 34 19
చౌదరి గూడెం 30 05
కేశంపేట 24 07
కొత్తూరు 11 22
కొందుర్గు 13 25
నందిగామ 16 10
శంషాబాద్ 17 31
మొత్తం 145 119






