ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా?.. పట్టించుకోని అధికారులు

by I. Sairam |

ప్రభుత్వ అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా?.. పట్టించుకోని అధికారులు
X

దిశ, బషీరాబాద్: ప్రభుత్వ అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. మండల వ్యాప్తంగా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని నావంద్గి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 30 గుంటల స్థలంలో ఆ గ్రామానికి చెందిన ఓ నాయకుడు కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రహారీ గోడ లేకపోవడంతోనే..

2020లో పాఠశాలకు చెందిన 30 గుంటల భూమి ఉన్నట్టు అప్పటి హెచ్ఎం, నాటి తహసీల్దార్ సంతకాలతో కూడిన స్థలం విస్తీర్ణ నివేదికను జిల్లా అధికారులకు సమర్పించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఆ స్థలాన్ని ఓ నాయకుడు ఆక్రమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ..

ప్రభుత్వ స్థలాల కాబ్జాలపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, విచారణ సైతం చేపట్టకపోవటంతో అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు మారుమూల మండలం కావడంతో జిల్లా అధికారుల సందర్శన కొరవడటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story