- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్సింగిలో ఓసీల దందా.. అంగట్లో సరుకుల్లా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు!
నార్సింగిలో నిబంధనలకు విరుద్ధంగా ఓసీలు జారీ చేస్తుండటంపై అధికారులు సీరియస్ అవుతున్నారు.

దిశ, గండిపేట : నార్సింగి పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీలు) అడ్డగోలుగా జారీ చేశారనే ఆరోపణలు రోజురోజుకీ బలపడుతున్నాయి. గత ఆరు నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా అనేక భవనాలకు ఓసీలు ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత విభాగం ఏసీపీ మనోహర్ తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆక్యుపెన్సి సర్టిఫికెట్లకు సంబంధించి వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. పదుల సంఖ్యలో ఆయనకు కాల్ చేసినా కూడా ఏమాత్రం ఫలితం శూన్యముగా కనిపిస్తుంది.
అంగట్లో సరుకుల్లా ఓసీలు..
భవనాలకు ఆక్యుపెన్సి సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అవేమి పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్స్ లేకపోయినా, అదనపు అంతస్తులు నిర్మించినా భవనాలకు ఓసీలు జారీ చేయవద్దు. కానీ అధికారులు "అంగట్లో సరుకుల్లా ఓసీలు" జారీ చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల 'దిశ' పత్రికలో కథనం వెలువడిన విషయం తెలిసిందే.
'మాములు'గా తీసుకుంటున్న అధికారులు..
భవనాలకు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు నార్సింగి సర్కిల్ ఉన్నత అధికారులు వ్యవహారాన్ని 'మామూలు'గా తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చాలామంది బిల్డర్లు ప్లానింగ్ ఒక విధంగా చూపించి మరో విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎలాంటి సెట్ బ్యాకులు పాటించడం లేదు. అయినా కూడా ఆయా భవనాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఓసీలు జారీ చేయడం వెనుకాల దందానే సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓసీల జారీ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని ఏసీపీ మనోహర్..
ఓసిల జారీ, అడ్డగోలు దందా వ్యవహారంపై వివరణ కోరెందుకు నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపి మనోహర్ ను పలుమార్లు ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వ్యవహారంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆరు నెలలుగా జారీచేసిన ఆక్యుపెన్సి సర్టిఫికెట్ల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసిల దందాలో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.






