మహేశ్వరంలో బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువు ?

by Ajay Maddhiboyina |

పంచాయతీ ఎన్నికల వేళ మహేశ్వరం మండలం పరిధిలోని గ్రామాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది.

మహేశ్వరంలో బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువు ?
X

దిశ, మహేశ్వరం : పంచాయతీ ఎన్నికల వేళ మహేశ్వరం మండలం పరిధిలోని గ్రామాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ బలహీన పడడంతో, ఆ పార్టీ తరఫున పోటీకి ముందుకు రావడానికి కూడా అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొన్నట్టు ఆయా గ్రామాల ప్రజల చెబుతున్నారు.

పార్టీ రహితంగా జరిగినప్పటికీ..

వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. గుర్తులు కూడా పార్టీకి సంబంధం లేకుండా ఉంటాయి. కానీ గ్రామాల్లో ఒక పార్టీకి చెందిన నాయకుల్లో నుంచి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేస్తున్నారు. దీంతో ఫలనా అభ్యర్థి ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని గ్రామస్తులందరికీ సులువుగా తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో అనధికారికంగా, బీ ఫామ్ లేకుండానే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల తరుఫున అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. అయితే మహేశ్వరం మండలంలోని మన్షన్‌పల్లి, అమీర్‌పేట్, ఆకన్‌పల్లి, ఉప్పుగడ్డతాండ, గట్టుపల్లి లాంటి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఓ కారణమైతే.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి జరగదని ఓటర్లు అనుకుంటున్నట్టు నాయకులు చెబుతున్నారు.

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు..

మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మూడో విడత నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు, ఆసక్తి గల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచి ప్రజల మద్దతు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. మండలంలోని మన్షన్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ తరఫున ఓ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. యనకు అక్కడి బీఆర్‌ఎస్ నాయకుల మద్దతు కూడా లభిస్తోంది. దీంతో గ్రామంలో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో గ్రామంలో ఎన్నికల చర్చలు హీట్‌ పెంచుతున్నాయి.

Next Story