మా సంగతి ఏంటి.. నిమ్జ్ రోడ్డు భూ బాధితులు

by Batti.Sumithra |

జహీరాబాద్ జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) కోసం ప్రత్యేక రహదారిలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అదోగతిలా ఉంది.

మా సంగతి ఏంటి.. నిమ్జ్ రోడ్డు భూ బాధితులు
X

దిశ, ఝరాసంగం : జహీరాబాద్ జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) కోసం ప్రత్యేక రహదారిలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అదోగతిలా ఉంది. ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం భూములు తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయిన వారి భూములను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. అమ్మనికి రాదు.. అన్నదమ్ములు పంపకానికి రాకుండా చేశారు. అధికారులు.. నిమ్జ్ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణం కోసం అధికారులు హుగ్గేలి నుంచి బర్దిపూర్ వరకు 229 మంది రైతుల నుంచి సుమారుగా 65 ఎకరాల భూమిని సేకరించారు. వారికి నష్టపరిహారం కింద రూ. 7.50 కోట్ల చెల్లించారు. రైతుల భూమిని బ్లాక్ లిస్ట్ వెయ్యడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు.

వారికి సైతం భూమి హక్కులు రాకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బర్దిపూర్ గ్రామానికి చెందిన బుక్క బిక్కుసాబ్ అనేరైతు గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. మృతుడి వారసులు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ వారి పేరు గాని వారి తల్లి పేరు పట్టా మార్పిడి చేద్దామనుకొని రెండు సంవత్సరాల నుంచి తిరిగినప్పటికీ పేరు మార్పిడి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై అధికారులకు రైతులు సమాచారం కోరుతూ... 229 మంది రైతుల భూములను కోల్పోగా కొంతమంది రైతుల మాత్రమే బ్లాక్ లిస్టులో ఉంచారని మరి కొంతమంది రైతులది లిస్ట్ పై అధికారుల వద్ద ఫైల్ ఉందని చెప్పుకొచ్చారు. జహీరాబాద్ ఆర్డీవో కు ఇదే విషయంపై దిశ ఫోన్ ద్వారా వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Next Story