మైనార్టీ శ్మశాన వాటిక, సబ్ స్టేషన్‌కు స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు వినతి

by Kodari Anjali |

గ్రామ ప్రజలు కలిసి మైనార్టీ శ్మశానం వాటిక, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించాలని తాళ్లపల్లిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎమ్మార్వోను కోరారు.

మైనార్టీ శ్మశాన వాటిక, సబ్ స్టేషన్‌కు స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు వినతి
X

దిశ, మంచాల: మంచాల మండలం ఎమ్మార్వో ప్రసాద్‌ను తాళ్లపల్లిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జోగు శంకరయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కలిసి మైనార్టీ శ్మశాన వాటిక, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. గ్రామాభివృద్ధికి ఈ సదుపాయాలు అత్యవసరమని వారు ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జోగు శంకరయ్య మాట్లాడుతూ... గ్రామ సమస్యలను వివరించారు. సంబంధిత అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భిక్షపతి, శానేవాజ్, సురేష్ పాల్గొన్నారు.

Next Story