50 శాతం రాయితీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు

by velandi.Saikiran |

పెద్దేముల్ మండల రైతులకు 40శాతం, 50శాతం, రాయితతో వ్యవసాయ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పెద్దేముల్

50 శాతం రాయితీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు
X

దిశ పెద్దేముల్: పెద్దేముల్ మండల రైతులకు 40శాతం, 50శాతం, రాయితీపై వ్యవసాయ పనిముట్ల ఇస్తున్నామని, దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రితమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద‌ బ్యాటరీ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, రోటోవేటర్లు, సీడ్ డ్రిల్, ఎంబి నాగలి, పవర్ టిల్లర్, స్ట్రా బెయిలర్, బ్రష్ కట్టర్, కేజ్ వీల్స్ వంటీ పలు రకాల వ్యవసాయ పరికారాలు 40-50 శాతం, సబ్సిడీ అందిస్తున్నారు.

ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినవి

1.పట్టా పాస్‌బుక్

2.ఆధార్ కార్డ్

3.సాయిల్ హెల్త్ కార్డ్

4.ట్రాక్టర్ ఆర్.సి, లైసెన్స్

5.4- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

6.బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్

7.దరఖాస్తు ఫారం

సమాచారం కొరకు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరు

అరుణ -8977769039

తేజస్విని -8977769035

శివరాత్ -8977769040

చంద్రకళ -8977769038.

Next Story