రేషన్ కార్డ్‌తోనే సంక్షేమ పథకాల లబ్ధి: ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

by Kodari Anjali |

రేషన్ కార్డు ఉంటేనే ఉచితంగా వైద్యంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు.

రేషన్ కార్డ్‌తోనే సంక్షేమ పథకాల లబ్ధి: ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
X

దిశ, పరిగి: రేషన్ కార్డు ఉంటేనే ఉచితంగా వైద్యంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్, రాఘవాపూర్, జాఫర్ పల్లి, కాలాపూర్, ఖుదా వందపూర్, రావులపల్లి, రాపోల్ , చిట్యాల, సయ్యద్ పల్లి, తొండపల్లి, యాబాజి గూడెం తదితర గ్రామాల్లో రేషన్ కార్డు మంజూరైన లబ్ధిదారులకు అందజేశారు. పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు.

పదేళ్లుగా పేదలకు రేషన్ కార్డు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు అన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రేషన్ కార్డులు అందించి మూడు నెలల రేషన్ సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరుశురాం రెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, లాల్ కృష్ణ ప్రసాద్, హనుమంతు ముదిరాజ్, వెంకటేష్, రామకృష్ణారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.

Next Story