- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాండూరులో మంత్రుల పర్యటన.. ఎప్పుడంటే?
రాష్ట్రంలో మే 4 నుంచి మే 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

దిశ, తాండూరు: రాష్ట్రంలో మే 4 నుంచి మే 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శనివారం 'దిశ' దినపత్రికతో పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎస్విఆర్ గార్డెన్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 'టీజీ ఆర్గానిక్స్' అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
ఇది సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ఉపయోగపడుతుందన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, రైతులకు కల్పించిన పథకాలతో పాటు పంట కోతలు, వరి ధాన్యం కొనుగోలు, నకిలీ ఉత్పత్తుల నియంత్రణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. యాలాల మండలం జుంటుపల్లి సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటను సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు విధిగా పాల్గొనాలని కోరారు.






