- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడం సార్.. మేడం అంతే! షాద్‌నగర్ వైద్య శాఖలో డిప్యూటీ డీఎంహెచ్ఓకు రాజకీయ అండ!
ఆ వైద్యాధికారిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజాలేనని తేలినా జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు షాద్‌నగర్ వైద్య శాఖలో తీవ్ర చర్చానీయమైంది.

దిశ, షాద్‌నగర్ : మేడం సార్.. మేడం అంతే.. ఆ వైద్యాధికారిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజాలేనని తేలినా జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు షాద్‌నగర్ వైద్య శాఖలో తీవ్ర చర్చానీయమైంది. షాద్‌నగర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రెండేళ్లుగా ఇంచార్జ్‌తోనే కొనసాగుతుంది. తనకున్న రాజకీయ అండదండలతో చేవెళ్ల డివిజన్ షాబాద్ మండల వైద్యురాలుగా విధులను నిర్వహిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి.. షాద్ నగర్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై వచ్చారు. డాక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఆమెపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను నిర్వర్తిస్తూనే స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులను నిర్వహిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, తన ప్రైవేట్ ఆసుపత్రి అభివృద్ధి కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు కిందిస్థాయి వైద్య సిబ్బందికి తాయిలాలను ఇచ్చేవారని, తనకు సహకరించని వారిని వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ విజయలక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై జిల్లా వైద్యాధికారులు విచారణ కమిటీ వేసి ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ నిజాలేనని తేల్చినట్లు తెలిసింది. విచారణ కమిటీ ముందు డాక్టర్ విజయలక్ష్మి తాను ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తూ, ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టు తెలిసింది. విచారణ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా వైద్యాధికారులు డాక్టర్ విజయలక్ష్మిపై చర్యలు తీసుకునేందుకు మెమోను సైతం జారీ చేశారు.
ఆ నేత జోక్యంపై సర్వత్రా చర్చ..
డిప్యూటీ డీహెచ్ అండ్ హెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా రాజకీయ అండదండలతో షాద్‌నగర్ డిప్యూటీ డీహెచ్ అండ్ ఎంఓగా కొనసాగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. స్థానిక నియోజకవర్గ స్థాయి బడానేత డాక్టర్ విజయలక్ష్మిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని జిల్లా వైద్య శాఖలో చర్చ జరుగుతోంది. చేవెళ్ల డివిజన్ షాబాద్ వైద్యురాలుగా కొనసాగుతున్న డాక్టర్ విజయలక్ష్మి స్థానంలో ప్రస్తుతం కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డిప్యూటేషన్‌పై పనిచేస్తోంది. ఇప్పటికైనా.. ఆరోపణలను ఎదుర్కొంటున్న షాద్‌నగర్ ఇంచార్జ్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓపై వెంటనే చర్యలు తీసుకొని రెగ్యులర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓను నియమించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.






