- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన ఈత సరదా..
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. అందులో ఒకరి డెడ్ బాడీ లభ్యం కాగా.. మరో డెడ్ బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... టోలిచౌకికి చెందిన సమీర్, షాబాజ్ (22), పిరం చెరువుకు చెందిన సల్మాన్(22) లు స్నేహితులు. ముగ్గురు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు హిమాయత్ సాగర్ కాలువ వద్దకు చేరుకున్నారు. వారికి ఈత రాకపోయినా లోతు తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కాలువలోకి దిగారు.
కన్నీరుమున్నీరవున్న బంధువులు...
లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగారు. ముగ్గురు నీట మునుగుతున్న విషయాన్ని గుర్తించిన పక్కనే ఉన్న ఈతగాళ్లు సమీర్‌ను ఒడ్డుకు చేర్చారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి పోలీసులు డిఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బందితో చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చేశారు. సాయంత్రం వరకు గాలింపు చేయగా సల్మాన్ మృతదేహం లభ్యం కాగా షబాజ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






